
అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాల షెడ్యూల్ విడుదలైంది.
సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. దేవస్థానం కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో విడుదల చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు ఉత్సవాల షెడ్యూల్‌ను ప్రకటించారు.
ఫిబ్రవరి 8న రథసప్తమి, 11న స్వామి కల్యాణం, 12న రథోత్సవం, 16న పౌర్ణమి సముద్రస్నానం, 17న తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్, అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ జి.ప్రసాద్, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఈఓ బి.వెంకటేశ్వరరావు, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. (చదవండి: తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్)