సాక్షి, అమరావతి: అంతర్వేది ఘటనపై ట్విటర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. ‘‘అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి: చిట్టీ నాన్నారుని అడుగు చెప్తారు..)
నటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి
విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ, రంగస్థలం ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయిందని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకి శాంతిచేకూరాలని, భగవంతుడు ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment