విశేషమైన క్షేత్రం అంతర్వేది | antarvedi visista temple | Sakshi
Sakshi News home page

విశేషమైన క్షేత్రం అంతర్వేది

Jan 18 2017 10:52 PM | Updated on Sep 5 2017 1:32 AM

చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది క్షేత్రం విశేషమైన క్షేత్రమని మైసూరు శ్రీదత్త పీఠం అధిపతి గణపతి సచ్చితానంద స్వామీజీ అన్నారు. అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామి దర్శనానికై బుధవారం వచ్చిన స్వామీజీకి ఆలయ మాజీ ప్రధానార్చకుడు వాడపల్లి

సఖినేటిపల్లి (రాజోలు) : 
చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది క్షేత్రం విశేషమైన క్షేత్రమని మైసూరు శ్రీదత్త పీఠం అధిపతి గణపతి సచ్చితానంద స్వామీజీ అన్నారు. అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామి దర్శనానికై  బుధవారం వచ్చిన స్వామీజీకి ఆలయ మాజీ ప్రధానార్చకుడు వాడపల్లి బుచ్చిబాబు, ప్రస్తుత ప్రధానార్చకుడు కిరణ్, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి, స్థానాచార్య రామరంగాచార్యులు, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ చిక్కాల వెంకట్రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఆశీస్సులు పలికారు.  సమాజంలో అందరికీ ధర్మబుద్ది కలిగించమని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. అంతరాలయంలో ఉన్నంతసేపు వైకుంఠంలో ఉన్నట్లుగా ఉందని స్వామీజీ  పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement