టీడీపీ ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం | mla escaped from the accident | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

Published Fri, Jan 30 2015 5:32 PM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

టీడీపీ ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

టీడీపీ ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

మలికిపురం(తూర్పుగోదావరి): మలికిపురం మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రథోత్సవంలో శుక్రవారం తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో  ప్రజలంతా ఒక్కసారిగా రథం పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుపై  పడటంతో ఆయన ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. వెంటనే ఈ విషయం గ్రహించిన ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే మీద పడ్డ ప్రజలను పైకి తీయడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

 

అప్పటికే ఆక్సిజన్ అందక గొల్లపల్లి సూర్యారావు  ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు ఆలయ సిబ్బంది అతిథి గృహంలో సపర్యలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఉన్న ఆర్డీఓ, కొంత మంది ప్రజలు కూడా ఇబ్బందిపడ్డారు.  అనంతరం రథోత్సవం యథావిధిగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement