gollapalli suryarao
-
చంద్రబాబు, లోకేశ్‌వి దుర్మార్గమైన ఆలోచనలు: గొల్లపల్లి
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు వైఎస్సార్సీపీలో చేరారు. వారు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పెత్తందార్లకు అనుకూలంగా, దళిత వర్గాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిబద్దతతో పనిచేసిన తనను తీవ్రంగా అవమానించారని, చంద్రబాబు మెడపట్టి పార్టీ నుంచి గెంటేశారని వాపోయారు. సీఎం వైఎస్ జగన్ దేవుడి రూపంలో తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి తాను కష్టపడి పనిచేశానని, పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. 2014లో అమలాపురం పార్లమెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మొండి చేయి చూపించారన్నారు. అయినా క్రమశిక్షణ కలిగిన నేతగా తాను ఎంతో కష్టపడి జిల్లాలో పార్టీని కాపాడుకున్నానని అన్నారు. జనసేన, టీడీపీ పొత్తు పేరు చెప్పి తనకు సీటు లేకుండా చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ ఉంటే ఉండు పోతే పో అన్నట్లు చూశారని, జీవితంలో ఎప్పుడూ అనుభవించని అవమానం టీడీపీలో ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తనకు ధైర్యాన్నిచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. లోకేశ్ ముఠా రాష్ట్రాన్ని కబళించాలని చూస్తోందని తెలిపారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలో చనలకు పవన్ బలి అయ్యారని, పోత్తులో మోసం చేసి బాబు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. జనసేన మనుగడ కష్టమేనన్నారు. దేవుడిలాంటి మనిషైన వైఎస్సార్ నన్ను ఎంతో దగ్గరకు తీసి రాజకీయంగా ప్రోత్సహించి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. ఆ మహానుభావుడి కుమారుడైన సీఎం జగన్ దగ్గరకి చేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కోసం శాయశక్తులా పనిచేస్తానని చెప్పారు. తుది శ్వాస వరకు సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని, ఆయన ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపారు. మిథున్‌రెడ్డి, కేశినేని నానితో చర్చలు గొల్లపల్లి సూర్యారావు మంగళవారం రాత్రి విజయవాడలోని కేశినేని భవన్లో ఎంపీలు కేశినేని నాని, మిథున్‌రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సూర్యారావు ప్రకటించారు. చంద్రబాబు ఆలోచనశైలి పెత్తందార్లకు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్య క్రమాల పట్ల ఆకర్షితుడినయ్యానని తెలిపారు. -
టీడీపీని వీడి YSRCPలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
-
'రోజాపై స్పీకర్‌కు నివేదిక ఇస్తాం'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా ఇచ్చిన వివరణను నమోదు చేసుకున్నామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఆమె ఇచ్చిన వివరణపై మరోసారి సమావేశం అయ్యి సభ్యులమంతా చర్చించి నివేదిక రూపంలో స్పీకర్‌కు అందజేస్తామని చెప్పారన్నారు. ప్రివిలేజ్ కమిటీ చట్టబద్ధతతో కూడుకున్న కమిటీ అయినందున ఇంతకుమించి ఎక్కువ విషయాలు చెప్పలేమని అన్నారు. తొలుత స్పీకర్ ద్వారా సభకు తెలియజేయడం తన బాధ్యత అని ఆ తర్వాత సభగానీ, సభ నిర్ణయం మేరకు తాను గానీ తీసుకునే నిర్ణయంపై పూర్తి వివరాలు అందజేస్తామని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం
మలికిపురం(తూర్పుగోదావరి): మలికిపురం మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రథోత్సవంలో శుక్రవారం తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా రథం పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుపై పడటంతో ఆయన ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. వెంటనే ఈ విషయం గ్రహించిన ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే మీద పడ్డ ప్రజలను పైకి తీయడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటికే ఆక్సిజన్ అందక గొల్లపల్లి సూర్యారావు ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు ఆలయ సిబ్బంది అతిథి గృహంలో సపర్యలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఉన్న ఆర్డీఓ, కొంత మంది ప్రజలు కూడా ఇబ్బందిపడ్డారు. అనంతరం రథోత్సవం యథావిధిగా సాగింది. -
మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆహా..ఓహో...
హైదరాబాద్ : మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆహా.. ఓహో.. ఆయనకు మించిన నేత లేరని.. ప్రజా సేవకుడు లేడని ప్రశంస. కానీ ఇప్పుడు అదే నేత.. ఆయన దృష్టిలో ఓ ద్రోహి. రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి. అవకాశం దొరికింది కదా అని ఆ నేతపై తీవ్ర విమర్శలులతో పాటు లేనిపోని ఆరోపణలు. పదవుల కోసం గడ్డి తింటారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా రాజోలు టిడిపి సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు నిలుస్తున్నారు. నాడు వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పని చేసిన గొల్లపల్లి.. ఆ తర్వాత పార్టీ మారి టిడిపి నుంచి గెల్చారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న గొల్లపల్లి మహా నేత వైఎస్‌పై అంతులేని విమర్శలు చేశారు. మైక్ దొరికిందే ఛాన్స్... ఆవేశంతో ఊగిపోతూ మహానేతపై లేనిపోని విమర్శలుకు దిగుతున్నారు. అలాగే కొడాలి నానిని మించిన ద్రోహి లేడని గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. అదే పనిగా వైఎస్ పైనా, జగన్‌పైనా సూర్యారావు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై సభలో నాని స్పందించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గొల్లపల్లి.. మరోసారి వైఎస్ జగన్‌పైనా.. కొడాలి నాని పైనా ఆగ్రహంతో ఊగిపోయారు. పైపెచ్చు తాను దళిత నేతను అయినందునే ప్రతిపక్ష సభ్యులు తన ప్రసంగానికి అడ్డు పడుతున్నారంటూ ఎదురు దాడికి దిగటం విశేషం. పనిలో పనిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
పోలీసుల తీరుపై టీడీపీ సభ్యుడి ఆగ్రహం!
గ్రామాల్లో హత్యలు, దోపిడీలు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని రాజోలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మలికిపురం మండల కేంద్రంలో ఇటీవల సీతారత్నం అనే మహిళను నోటికి, చేతులకు ప్లాస్టర్లు వేసి వాళ్ల ఇంట్లో ఉన్న బంగారం, కొద్దిపాటి నగదు దోచుకుని, చివరకు ఆమెను చంపేశారని ఆయన చెప్పారు. గ్రామంలో చిన్న మెడికల్ షాపు నిర్వహించుకునే వాళ్ల కుటుంబం వివాదాలకు చాలా దూరంగా ఉంటుందని గొల్లపల్లి అన్నారు. ఇప్పటికి ఇలాంటి దోపిడీలు, హత్యలు ఐదారు జరుగుతున్నా పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దీన్ని పట్టించుకుని పోలీసులకు తగిన ఆదేశాలిచ్చి ఆ ప్రాంతంలో రక్షణ కల్పించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. -
డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం అయిద గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు ఖరారు అయ్యింది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్‌గా కాలువ శ్రీనివాసులు పేరు ఖరారు కాగా, మరో ముగ్గురు విప్ లపై టీడీపీ కసరత్తు చేస్తోంది. విప్ లుగా బొండా ఉమా మహేశ్వరరావు, కూన రవికుమార్, జయనాగేశ్వరరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఏకే జవహర్ పేర్లు పరిశీలిస్తోంది.