గ్రామాల్లో హత్యలు, దోపిడీలు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని రాజోలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని మలికిపురం మండల కేంద్రంలో ఇటీవల సీతారత్నం అనే మహిళను నోటికి, చేతులకు ప్లాస్టర్లు వేసి వాళ్ల ఇంట్లో ఉన్న బంగారం, కొద్దిపాటి నగదు దోచుకుని, చివరకు ఆమెను చంపేశారని ఆయన చెప్పారు.
గ్రామంలో చిన్న మెడికల్ షాపు నిర్వహించుకునే వాళ్ల కుటుంబం వివాదాలకు చాలా దూరంగా ఉంటుందని గొల్లపల్లి అన్నారు. ఇప్పటికి ఇలాంటి దోపిడీలు, హత్యలు ఐదారు జరుగుతున్నా పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దీన్ని పట్టించుకుని పోలీసులకు తగిన ఆదేశాలిచ్చి ఆ ప్రాంతంలో రక్షణ కల్పించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.
పోలీసుల తీరుపై టీడీపీ సభ్యుడి ఆగ్రహం!
Published Mon, Aug 25 2014 12:01 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement
Advertisement