సాక్షి, హైదరాబాద్: 2018 లో 8 లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయనిక్కడ శనివారం మీడియాతో మాట్లాడుతూ 2018 పోలీసు శాఖకు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ-చలాన్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తరహాలో అన్నీ పీఎస్‌లను తీర్చిదిద్దుతామన్నారు.
అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోలు సెంటర్లు ఏర్పాటు చేసి.. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. నేరాల సంఖ్య గతంతో పోలిస్తే 12.93 శాతం పెరిగిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తామని.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో త్వరలో 18, 290 పోస్టును భర్తీ చేయనున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment