మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆహా..ఓహో...
హైదరాబాద్ : మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆహా.. ఓహో.. ఆయనకు మించిన నేత లేరని.. ప్రజా సేవకుడు లేడని ప్రశంస. కానీ ఇప్పుడు అదే నేత.. ఆయన దృష్టిలో ఓ ద్రోహి. రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి. అవకాశం దొరికింది కదా అని ఆ నేతపై తీవ్ర విమర్శలులతో పాటు లేనిపోని ఆరోపణలు. పదవుల కోసం గడ్డి తింటారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా రాజోలు టిడిపి సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు నిలుస్తున్నారు.
నాడు వైఎస్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసిన గొల్లపల్లి.. ఆ తర్వాత పార్టీ మారి టిడిపి నుంచి గెల్చారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న గొల్లపల్లి మహా నేత వైఎస్‌పై అంతులేని విమర్శలు చేశారు. మైక్ దొరికిందే ఛాన్స్... ఆవేశంతో ఊగిపోతూ మహానేతపై లేనిపోని విమర్శలుకు దిగుతున్నారు. అలాగే కొడాలి నానిని మించిన ద్రోహి లేడని గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. అదే పనిగా వైఎస్ పైనా, జగన్‌పైనా సూర్యారావు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై సభలో నాని స్పందించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గొల్లపల్లి.. మరోసారి వైఎస్ జగన్‌పైనా.. కొడాలి నాని పైనా ఆగ్రహంతో ఊగిపోయారు. పైపెచ్చు తాను దళిత నేతను అయినందునే ప్రతిపక్ష సభ్యులు తన ప్రసంగానికి అడ్డు పడుతున్నారంటూ ఎదురు దాడికి దిగటం విశేషం. పనిలో పనిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.