హైదరాబాద్: భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు హైదరాబాద్ రానున్నారు. రైతు సంఘం జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొంటారు.
హైదరాబాద్: నేటి నుంచి 18 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాజధాని భూ కుంభకోణం, ప్రజా సమస్యలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీయనుంది.
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో మహిళా ప్రజాప్రతినిధుల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలకు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మహిళా ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించే అవకాశముంది.
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఇవాళ జరగాల్సిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.
హైదరాబాద్: తెలంగాణలో లా సెట్-2016 నోటిఫికేషన్ శనివారం విడుదలకానుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 10వ తేదీ వరకు అనుమతిస్తారు. మే 24న పరీక్ష జరగనుంది.
ఢిల్లీ: నేడు ఢిల్లీలో జరగనున్న జలవనరుల సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు.
హైదరాబాద్: గచ్చిబౌలిలో 'వైట్ సెన్సేషన్' ప్రపంచస్థాయి డ్యాన్స్ ఈవెంట్ జరగనుంది.
స్పోర్ట్స్: నేడు ప్రొకబడ్డీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 9 గంటలకు జరిగే మ్యాచ్‌లో యు ముంబాతో పట్నా తలపడనుంది.