news updates
-
వేట సమయంలో చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఇస్తున్నాం
-
వివిధ స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్
-
నిజాంపట్నంకు చేరుకున్న సీఎం జగన్
-
గంగ పుత్రులకు భరోసా
-
బాణా సంచాతో బుగ్గనకు స్వాగతం పలికిన వైయస్ అభిమానులు
-
చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపాటు
-
పాలకుడిని కాను.. పాలేరునని పవన్ స్పష్టం చేశారు
-
మూడు దఫలుగా హైదరాబాద్ మాడ్యూల్ ప్లాన్
-
పార్కింగ్ చేసిన కారునే చోరీ చేస్తున్నాడు
-
తిరుపతిలో అంగరంగా వైభవంగా గంగమ్మ జాతర
-
ఎన్టీఆర్ జిల్లాలో అదనంగా 168 ఎకరాలు కేటాయింపు
-
వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
-
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
కాంగ్రెస్ వైపే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మొగ్గు..!
-
ఇక నుంచి ఎండలే ఎండలు
-
పిసుక్కుంటున్న రేవంత్, తలసాని
-
మామిడి మియాజాకిలో అత్యంత పోషక విలువలు
-
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల సమ్మె
-
గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బీజేవైఎం ధర్నా
-
కర్నూలులో నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం
-
కఠిన నిబంధనలతో ఇబ్బందిపడ్డ విద్యార్థులు.. తల్లితండ్రుల అసహనం
-
మహిళలకోసం ప్రత్యేకంగా పట్టణంలోని ప్రకాశం పార్క్
-
నువ్వా నేనే అన్నట్టుగా సాగిన కాంగ్రెస్-బీజేపీ ప్రచారం
-
కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన బీజేపీ
-
బెంగళూరులో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
-
పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టిన గోపి,బ్రహ్మనాయుడు
-
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
టాప్ 25 న్యూస్ @ 7 AM 10 September 2022
-
వాడుకున్నప్పుడు వాటా ఇవ్వాల్సిందే.. గూగుల్, ఫేస్‌బుక్‌కు ఫీజు!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లలో వచ్చే వార్తాంశాలపై ఆ సంస్థల నుంచే ఫీజు వసూలు చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలను భారత ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రస్తుతం వార్తా సంస్థల్లో తయారయ్యే వార్తాంశాలను గూగుల్, ఫేస్బుక్ తదితర సంస్థలు యథేచ్చగా వాడుకుంటూ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆయా వార్తా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం తాజాగా.. వార్తాంశాల ద్వారా వచ్చే ఆదాయంలో వాటాను వార్తా సంస్థలకు అందజేసేందుకు, లేని పక్షంలో ఆయా కంపెనీల నుంచి జరిమానా వసూలు చేసేందుకు ఉద్దేశించిన నిబంధనలకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. -
టాప్ 60 న్యూస్@ 6AM 09 November 2021
-
టాప్ 60 న్యూస్@ 6AM 02 November 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 01 November 2021
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 7PM 31 October 2021
-
ఏపీ స్పీడ్ న్యూస్ @ 1PM 31 October 2021
-
సాక్షి జాతీయ వార్తలు 5pm 23 October 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 23 October 2021
-
సాక్షి బిజినెస్ వార్తలు 20 October 2021
-
సాక్షి జాతీయ వార్తలు 7PM 01 October 2021
-
సాక్షి జాతీయ వార్తలు 6PM 28 September 2021
-
టాప్ 25 న్యూస్@7AM 14 September 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 01 September 2021
-
ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా
కాన్బెరా: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు సహా ప్రభుత్వ సందేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేసింది. ఫేస్బుక్ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. వార్తలను షేర్ చేసినందుకు గూగుల్, ఫేస్బుక్ తదితర సంస్థలు ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని, అందుకు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంటూ ఆస్ట్రేలియా ఒక బిల్లును రూపొందించింది. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇక, ప్రపంచం మొత్తం కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఇదిలా ఉండగా, శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే, చెన్నై నగరంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరోసారి నిరసనలు వ్యక్తమయ్యాయి. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టును రూ. 10 నుంచి రూ. 50కి పెంచుతూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకై కీలక ముందడుగు పడింది. ఇదిలా ఉండగా, ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇక, పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేలా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, యెస్బ్యాంక్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం చోటుచేసుకకున్న మరిన్ని వార్తలకోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, దేశంలో చాపకిందనీరులా కోవిడ్-19 విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఇదిలా ఉండగా, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని విశేషాల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ వాయిదా ఇక లాంఛనమే. మరోవైపు, భారత్‌లో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతన్న నేపథ్యంలో టీటీడీ ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇకపోతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పాతబస్తీ మొగల్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని విశేషాల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో కీలక ప్రసంగం చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. ఇదిలా ఉండగా, సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మరోవైపు, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రూ.కోటి విరాళం ప్రకటించారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హౌజింగ్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఇదిలా ఉండగా, యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ సర్కార్ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో పటియాలా హౌస్ కోర్టు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా మహిళను నియమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గాయకుడు, బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
భారత్‌లో ఇప్పటివరకు 28 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. మరోవైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
సంచలనం సృష్టిస్తున్న ఈఎస్ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇకపోతే, నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. మరోవైపు రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక, తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ఆరేళ్లుగా ఈఎస్ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఇకపోతే, రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారికి జోలికి వెళ్లం.. కానీ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మరోవైపు అగ్రరాజ్యంలో మరో ఇండో- అమెరికన్ మహిళకు కీలక పదవి దక్కనుంది. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో శనివారం భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, బ్రదర్ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. ఇకపోతే, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ కన్నుమూశారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై పడిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారంలో అధిక సొమ్ము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్లిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇదిలా ఉండగా, పుల్వామా ఉగ్రదాడి ఘటనలో సైనికుల బలిదానాన్ని భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరా శిబిరంలో స్మారకస్తూపాన్ని ఆవిష్కరించారు. మరోవైపు టెలికాం కంపెనీలకు సర్వోన్నత న్యాయస్ధానం నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్ధూల రాబడి (ఏజీఆర్)పై బకాయిల చెల్లింపుల కోసం నూతన షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపోతే దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అని.. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలంటూ ఏవి లేవని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇదిలాఉండగా, రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల గురించి పూర్తిసమాచారాన్ని పార్టీ వెబ్సైట్లు, ప్రింట్ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. మరోవైపు, చైనాలో కొవిడ్-19 వైరస్ బుధవారం భారీగా విజృంభించింది. హుబెయ్ ప్రావిన్సులో నిన్న ఒక్కరోజే 242 మందిని కబలించింది. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, పెండింగ్ బిల్లులు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపని విషయాన్ని ప్రధానితో చర్చించారు. ఇదిలాఉండగా, ప్రజలు ఓడించి మూలనపడేసినా చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టడం హాస్యాస్పదమని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా భారత్‌లో సాదర స్వాగతం పలుకుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలీంగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ తొలి పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కరోనా రేపిన వైరస్ ప్రకంపనలు రోజుకు రోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి చైనాలో 764 మంది చనిపోయారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్చేయండి. -
టుడేస్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెపై నేడు కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఆర్టీసీ మ్మెపై అఖిలపక్షాలు చర్చలు జరపనున్నాయి. మరోవైపు పూర్తి కార్యాచరణకు కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది. ♦ నేటి నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు నిరసనలు చేపడుతున్నారు. ♦ తిరుమలలో నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయి. నేటి నుంచి దివ్య దర్శనం, టైమ్‌స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. ♦ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ భక్తులు దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ♦ దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ♦ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ♦ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్లనున్నారు. వైఎస్సార్సీపీ రాజమండ్రి నగర సమన్వకర్త శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ♦ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడంతో పాఠశాలలు, కాలేజీలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దాదాపు 60 రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. -
నేటి ముఖ్యవార్తలు
జీఎస్టీపై చర్చ ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినేట్ భేటీ కానుంది. బీసీ కమిషన్‌పై నివేదిక, జీఎస్టీ బిల్లుల ఆమోదంపై చర్చ జరగనుంది. కేంద్ర కేబినేట్ భేటీ నేడు సాయంత్రం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ అమలవుతున్న తీరుపై నేడు తమిళనాడు అధికారుల బృందంతో తెలంగాణ అధికారులు భేటీ కానున్నారు. హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ గురువారం హైదరాబాద్ రానున్నారు. ఉర్దూ వర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇంటర్మీడియెట్ ఫలితాలు రేపు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్న ఆంధప్రదేశ్ ప్రభుత్వం. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రిజర్వేషన్లపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఐపీఎల్-10 నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరుగనుంది. త్వరలో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి పలువురికి అవకాశం దక్కనుందని సమాచారం. 19 కొత్త ముఖాలకు చోటుకల్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్: కృష్ణా జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల అధికారులు మంగళవారం సమావేశం కానున్నారు. హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం నేడు జరుగును. ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్: కృష్ణాజిల్లా జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం నేడు విజయవాడలో జరుగనుంది. నగరంలో ఆలయాల తొలగింపు, కృష్ణా పుష్కరాల ఏర్పాట్లతో పాటు పలు కీలక అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశముంది. స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ నేటి మ్యాచ్‌లు తెలుగు టైటాన్స్ vs బెంగళూర్ బుల్స్ మహిళల మ్యాచ్ : ఫైర్ బర్డ్స్ vs స్టార్మ్ క్వీక్స్. -
టుడే న్యూస్ అప్డేట్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గసమావేశం సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంపై వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్: నేటి నుంచి FATPCCI శతాబ్ధి వేడుకలు హైదరాబాద్‌లో జరుగును. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. హైదరాబాద్: విత్తన ఎగుమతులపై నేడు జాతీయ సదస్సు జరుగును. ఈ సదస్సును తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తారు. తెలంగాణ: తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ సమ్మె బాట పట్టాయి. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయనున్నాయి. తెలంగాణ: సీఎస్ రాజీవ్ శర్మ అధికారులు, మంత్రులతో సోమవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హరితహారం కార్యక్రమంపై చర్చిస్తారు. తెలంగాణ: పాలిసెట్ వెబ్ ఆప్షన్ల ఎంపిక సోమవారంతో ముగియనుంది ఆంధ్రప్రదేశ్: విశాఖలో రెండు రోజుల పాటు బ్రిక్స్ ఇంధన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారు. ఎల్ఈడీ బల్బులు వినియోగం, ఇంధన ఆదాపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్: ధర్మపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలయాల కూల్చివేతపై విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో 40 మంది పీఠాధిపతులు పాల్గొంటారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను తెలంగాణ బార్ అసోషియేషన్ సభ్యులు నేడు కలవనున్నారు. న్యాయాధికారుల కేటాయింపులు, హైకోర్టు విభజనపై వారు ప్రధానంగా చర్చిస్తారు. తెలంగాణ: భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. తెలంగాణ: నేటి నుంచి తెలంగాణలో పాలీసెట్ తుది విడత కౌన్సిలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్: చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ఆదివారం బహిరంగ సభ నిర్వహించనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ-పాస్‌బుక్స్‌కు వ్యతిరేకంగా నేటి నుంచి రైతు సంఘాలు, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో సదస్సులు జరుగును. ఆంధ్రప్రదేశ్: నేడు విశాఖలో సాక్షి-మైత్రి ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. స్పోర్ట్స్: నేటి ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు తెలుగు టైటాన్స్ vs పట్నా బెంగాల్ vs యు ముంబా యూరో ఫుట్‌బాల్ టోర్నీ క్వార్టర్లో ఐస్‌లాండ్‌తో తలపడనున్న ఫ్రాన్స్. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: నేడు రెండో రోజు అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. భారీ భద్రత ఏర్పాట్ల మధ్య బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్కు యాత్రికులు బయలుదేరారు. 48 రోజుల పాటు యాత్ర కొనసాగునుంది. హైదరాబాద్: 'సాక్షి' నేతృత్వంలో హరితహారం కార్యక్రమం జగద్గిరిగుట్టలో శనివారం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఓఎస్డీ పాల్గొంటారు. తెలంగాణ: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం శనివారం భేటీకానుంది. పెండింగ్ బిల్లులు, ఆరోగ్య సమస్యలపై చర్చించనున్నారు. తెలంగాణ: ప్రత్యేక జిల్లా కోరుతూ జనగాం బంద్‌కు నేడు జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సూళ్లూరుపేటకు వెళ్లనున్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు దబ్బల రాజారెడ్డి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. స్పోర్ట్స్: నేటి ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు దబాంగ్ ఢిల్లీ vs బెంగళూర్ బుల్స్ జైపూర్ పింక్ ఫాంథర్స్ vs పుణె. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: కేంద్ర మంత్రిమండలి సమావేశం గురువారం సాయంత్రం జరగనుంది. తమ రెండేళ్ల పనితీరుపై మంత్రులు ప్రధానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు రచించిన 'నరసింహుడు, హాఫ్ లయన్' పుస్తక ఆవిష్కరణ జరుగును. హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ గురువారం కోర్టులో హాజరుపరచనుంది. అనంతరం పీటీ వారెంట్‌పై ఢిల్లీ తరలించే అవకాశముంది. తెలంగాణ: రాష్ట్రంలో జులై 5 నుంచి ఎంసెట్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 14న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగును. 24 నుంచి తుది విడత కౌన్సిలింగ్, 29 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్: ఏపీ న్యాయమూర్తులపై తెలంగాణ లాయర్ల దాడులకు నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. స్పోర్ట్స్: నేటి క్వార్టర్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ పోర్చుగల్ vs పోలాండ్. -
టుడే న్యూస్ అప్డేట్స్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ: తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు నేటి నుంచి సహాయ నిరాకరణ చేయనున్నారు. కోర్టు విధులకు హాజరై మౌనంగా కూర్చోవాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చైనాలో మూడు రోజు పర్యటిస్తున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో బాబు బృందం భేటీకానుంది. ఆంధ్రప్రదేశ్: నేటి నుంచి ప్రయోగాత్మకంగా స్మార్ట్ పల్స్ చేపట్టనున్నారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలుకు ఈ సర్వే ప్రామాణికం కానుంది. ఆంధ్రప్రదేశ్: కృష్ణాజిల్లా నాగాయలంకకు ఓఎన్జీసీ అధికారులు మంగళవారం రానున్నారు. నంగేగడ్డ చెరువుల్లో వెలువడుతున్న వేడికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తారు. స్పోర్ట్స్: నేటి నుంచి మహిళా కబడ్డీ లీగ్ ప్రారంభం స్పోర్ట్స్: నేటి ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు ఫుణెరి పల్టాన్ vs దబాంగ్ ఢిల్లీ. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్ లతో భేటీవుతారు. ఢిల్లీ: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ సోమవారం ఢిల్లీ వెళతారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం న్యాయవాది వివేక్ టంకతో నేతలు చర్చిస్తారు. హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ: ఎస్ఐ అభ్యర్థులకు నేటి నుంచి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్: నేడు విజయవాడలో 13 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండో రోజు చైనాలో పర్యటిస్తున్నారు. పలు కంపెనీల అధికారులతో బాబు బృందం భేటీకానుంది. స్పోర్ట్స్: నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ ప్రారంభం ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు బెంగాల్ vs ఢిల్లీ పుణె vs పట్నా స్పోర్ట్స్: నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీలో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లు రాత్రి 9.30 : ఇటలీ vs స్పెయిన్, రాత్రి 12.30 : ఇంగ్లండ్ vs ఐస్లాండ్ -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో ఈ భారతీయ ప్రాచీన ప్రక్రియను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని చండీగఢ్‌లో నిర్వహిస్తున్న భారీ యోగా ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటుండగా... ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ హాజరవుతున్నారు. ఢిల్లీ: కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. ఇరు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్న ప్రముఖులు. రాజ్ భవన్‌లోని కార్యక్రమంలో పాల్గొంటున్న గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్: విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్లో యోగా వేడుకల్లో పాల్గొంటున్న కేంద్రమంత్రి సురేష్ ప్రభు, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ఇంజనీరింగ్ ఆప్షన్ల మార్పునకు నేటితో తుది గడువు ముగింపు స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు. స్పోర్ట్స్: నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు రాత్రి 9.30 : ఉక్రెయిన్ vs పోలాండ్, జర్మనీ vs నార్తర్న్ ఐర్లాండ్ రాత్రి 12.30 : చెస్ రిపబ్లిక్ vs టర్కీ, స్పెయిన్ vs క్రొయేషియా. -
టుడే న్యూస్ అప్డేట్స్
కోల్‌కతా: నేడు కోల్‌కతాలో ఆర్థిక శాఖ మంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లుపై చర్చిస్తారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సమవేశానికి హాజరవుతారు. ఢిల్లీ: తెలంగాణ మంత్రి జోగు రామన్న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ నిర్వహించే సమావేశానికి ఆయన హాజరవుతారు. ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు భేటీకానున్నారు. నెల్లూరు టోల్గేట్ వివాదంపై ఆయనతో శిద్దా చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరుగును. ఈ సమావేశంలో బాబు నిరంకుశ పాలన, రెండేళ్ల వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ఆరో రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కారించేంత వరకు దీక్ష విరమించేది లేదని ఆయన చెప్పారు. వైద్యానికి ముద్రగడ నిరాకరించడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆంధ్రప్రదేశ్: ఏపీ కేబినేట్ సబ్‌కమిటీ మంగళవారం భేటీకానునుంది. అమరావతిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రులు చర్చిస్తారు. తిరుమల: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పాలక మండలి నిర్ణయాలు తీసుకోనుంది. స్పోర్ట్స్: నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు రాత్రి 9.30 : ఆస్ట్రియా vs హంగేరి రాత్రి 12.30 : పోర్చుగల్ vs ఐస్లాండ్. -
టుడే న్యూస్ అప్డేట్స్
యూపీ: నేటి నుంచి అలహాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. ఢిల్లీ: నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి. హైదరాబాద్: నేడు టీ పీసీసీ కార్యవర్గ సమావేశం జరుగును. పార్టీ పరిస్థితులు, నేతల వలసలపై ప్రధానంగా చర్చిస్తారు. రాజమండ్రి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కారించేంత వరకు దీక్ష విరమించేది లేదంటూ వైద్యానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలో ముద్రగడ, ఆయన భార్య, కోడలు దీక్ష కొనసాగిస్తున్నారు. స్పోర్ట్స్: నేడు ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ జరుగును. ఈ మ్యాచ్‌లో సున్ యూ, సైనా నెహ్వాల్ తలపడతారు. నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు సాయంత్రం 6.30 : టర్కీ vs క్రొయేషియా రాత్రి 9.30 : పోలాండ్ vs నార్తర్నర్ ఐర్లాండ్ రాత్రి 12.30 : జర్మనీ vs ఉక్రెయిన్. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు ఖతార్‌లో పర్యటిస్తారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలకాంశాలపై ఆ దేశాధినేతలతో మోదీ చర్చిస్తారు. ఢిల్లీ: నేడు జేఈఈ అడ్వాన్స్డ్ కీ విడుదలతో పాటు జిప్మర్ ఆన్లైన్ ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. హైదరాబాద్: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ నేడు హైదరాబాద్‌లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఐదో రోజు రైతు భరోసా యాత్ర చేయనున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీలో టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ నేడు అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగనుంది. ఈ ధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటారు. స్పోర్ట్స్: నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగును. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో జొకోవిచ్, ముర్రే తలపడతారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అఫ్గానిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లో ఆయన పర్యటిస్తారు. ఆ దేశాలతో వ్యాపారం, ఇంధన, భద్రత రంగాల్లో సహకారం పెంపుదలపై చర్చిస్తారు. హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రజా నాట్యమండలి తొలి మహాసభలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ: భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బృందం శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ఉమాభారతితో హరీష్ బృందం చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో నాలుగో రోజు రైతు భరోసా యాత్ర చేయనున్నారు. కదిరి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు భేటీకానున్నారు. ఆంధ్రప్రదేశ్: నేడు సీఎస్ ఠక్కర్తో ఉద్యోగ సంఘాలు సమావేశమవుతారు. రాజధానికి ఉద్యోగుల తరలింపుపై ప్రధానంగా చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ పీజీ ఈ సెట్-2016 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. స్పోర్ట్స్: నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగును. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో ముగురుజ, సెరెనా విలియమ్స్ తలపడతారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. బలసోర్ జిల్లాలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. తెలంగాణ: నేడు తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. దీని కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి అవార్డులను ఆయన ప్రదానం చేస్తారు. హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రిజిస్ట్రార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో రెండో రోజు రైతు భరోసా యాత్ర చేయనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్: నేడు విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు నవ నిర్మాణ దీక్ష చేస్తారు. బెంజిసర్కిల్‌లో నిర్వహించే దీక్షలో ఆయన ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎడ్ సెట్-2016 ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మొరాకోలో పర్యటిస్తున్నారు. టెర్రరిజం, భద్రతా మండలి విస్తరణపై ఆ దేశాధికారులతో ఆయన చర్చలు జరుపుతారు. ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్: నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ: తెలంగాణలో ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన ఐ సెట్-2016 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మంగళవారం విడుదల చేస్తారు. తెలంగాణ: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్: నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ నామినేషన్ వేస్తారు. ఆంధ్రప్రదేశ్: తమిళనాడు గవర్నర్ రోశయ్య నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: నేటి నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జర్మనీ పర్యటన తెలంగాణ: ఇవాళ తెలంగాణ టెట్ ఫైనల్ కీ విడుదల తెలంగాణ: ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలంటూ సోమవారం నుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్ష తెలంగాణ: ఆదివారం అర్థరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగారు. 14.5 శాతం వ్యాట్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్: నేడు ఏపీ కాంగ్రెస్ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరుగును. భవిష్యత్తులో చేయాల్సిన ఉద్యమాలు, ఆందోళనలపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సమావేశమవుతారు. బలం లేకున్నా పోటీ చేస్తున్న రాజ్యసభ నాలుగో అభ్యర్థి గెలుపుపై ఓటుకు కోట్లు తరహాలో వ్యూహాలు రచించనున్నారు. స్పోర్ట్స్: నేటి నుంచి ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ: నేటి అర్థరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగనున్నారు. 14.5 శాతం వ్యాట్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎంసెట్ రెండో విడత ర్యాంకులు ఆదివారం విడుదలవుతాయి. ఆంధ్రప్రదేశ్: నేటితో టీడీపీ మహానాడు ముగియనుంది. టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగును. స్పోర్ట్స్: ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్ జరుగును. స్పోర్ట్స్: నేడు మొనాకో గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసు జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
అంతర్జాతీయం: ఇవాళ, రేపు ఉత్తర అమెరికాలో నాటా సభలు ఢిల్లీ: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల తెలంగాణ: రేపు అర్థరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్లు నిరవధిక సమ్మె తెలంగాణ: తెలంగాణ ఎంసెట్-2 నోటిఫికేషన్ శనివారం విడుదల తెలంగాణ: నేటి నుంచి ఐదు రోజుల పాటు యాదాద్రిలో వరుణయాగం ఆంధ్రప్రదేశ్: నేడు ఏపీసీసీ చీఫ్ రఘువీరాతో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భేటీ ఆంధ్రప్రదేశ్: తిరుపతిలో నేడు రెండో రోజు టీడీపీ మహానాడు. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాడి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. దీనిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఢిల్లీ: చైనా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అవుతారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజులపాటు కేంద్ర నీరాంచల్ పథకంపై వర్క్ షాప్ జరగనుంది. ఈ వర్క్ షాప్‌కు ఐదు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారు. తెలంగాణ: తెలంగాణ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి. ఆంధ్రప్రదేశ్: కేంద్రప్రభుత్వ విజయాలపై నేటి నుంచి ఏపీ బీజేపీ నేతలు వినూత్న ప్రచారానికి చేపట్టనున్నారు. వికాస్ పర్వ్ పేరుతో వచ్చే నెల 15 వరకు ఈ ప్రచారం కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్: ప్రధాని మోదీ ఎన్నికల హామీల వైఫల్యాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయనుంది. ఆంధ్రప్రదేశ్: విజయవాడలో ఏపీ కలెక్టర్ల రెండో రోజు సదస్సు జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: నాలుగు రోజుల చైనా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ గురువారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అవుతారు. కేరళ: కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి సీతారాం ఏచూరి, ప్రకాష్ కరత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. తెలంగాణ: మెడికల్ ఎంసెట్-2 నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. జులై 9న ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ: బీసీ గురుకులాల వేసవి శిక్షణా తరగతులు నేటితో ముగియనున్నాయి. ఆంధ్రప్రదేశ్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. రెండెంకల వృద్ధిరేటుపై కలెక్టర్లకు బాబు దిశానిర్దేశం చేస్తారు. ఆంధ్రప్రదేశ్: నేడు విజయవాడలో ఎన్జీ రంగా వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ భేటీ జరుగును. ప్రైవేట్ రంగంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్: తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు ట్రేడ్ బంద్ కొనసాగనుంది. సీటీవో తీరుకు నిరసనగా హోటళ్లు, దుకాణాల యజమానులు బంద్ పాటిస్తున్నారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగును. ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు హైదరాబాద్, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూఢిల్లీ: నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రణబ్ చర్చిస్తారు. అసోం: అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేంద్రమంత్రులు, సీఎంలు, పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌రావత్ మంగళవారం సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ ఆయన్ను ప్రశ్నించనుంది. హైదరాబాద్: నేటి నుంచి ఏపీ, తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ: పాలమూరు ప్రాజెక్టు భూసేకరణపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ: లా సెట్-2016 పరీక్ష నేడు జరగనుంది. ఉదయం జరిగే ఎల్ఎల్బీ పరీక్షకు 17,427 మంది, మధ్యాహ్నం జరిగే ఎల్ఎల్ఎం పరీక్షకు 1,793 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నేడు జరగనుంది. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ లయన్స్ జట్లు తలపడనున్నాయి. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూఢిల్లీ: నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా కలవనున్నారు. నీట్‌పై ఆర్డినెన్స్‌కు సంబంధించి వివరణ ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ప్రణబ్ న్యాయ సలహా కోరారు. చెన్నై: నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితతో పాటు 29 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ రోశయ్య వారి చేత ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటికే మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియం ముస్తాబైంది. తెలంగాణ: సీఎం కేసీఆర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం జరగనుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా జిల్లాల్లో నిర్వహించనున్న సంబరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. శ్రీహరికోట: సోమవారం ఉదయం ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగ పరీక్ష ప్రారంభం కానుంది. పునర్వినియోగ రాకెట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 70 కిలో మీటర్ల ఎత్తుకెళ్లి మళ్లీ భూమికి చేరుకోనుంది. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం చివరి అంకానికి చేరుకుంది. నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగును. ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఆంధ్రపద్రేశ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో జలదీక్ష చేయనున్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఈ నిరాహారదీక్ష తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ఐసెట్-2016 పరీక్ష సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగును. ఈ పరీక్షకు సెట్ కోడ్ విటీఎస్‌టీ ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. తెలంగాణ: నేడు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 243 పోలింగ్ కేంద్రాల్లో 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ: కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సోమవారం బీజేపీ ధర్నాకు దిగనుంది. ఈ ధర్నాకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరవుతారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు కోల్‌కతా వేదికగా కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఆంధ్రపద్రేశ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడురోజుల క్రితం కురిసిన వడగళ్ల వానకు పులివెందుల, లింగాల మండలాల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు సోమవారం సాయంత్రం వెలువడనున్నాయి. విశాఖలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామనేని శ్రీనివాస్ లు విడుదల చేస్తారు. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అరగంట తర్వాత విద్యార్థుల సెల్‌ఫోన్‌కు వారి ర్యాంక్ మేసేజ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్: సింహాద్రి అప్పన్న చందనోత్సవం సోమవారం ఉదయం జరగనుంది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు తొలి దర్శనం చేసుకోనున్నారు. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం మహాదీక్షకు దిగనున్నారు. ఆర్డీఎస్ సమస్యల పరిష్కారం కోసం సింగనూరు వద్ద దీక్ష చేస్తున్నారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు మొహాలీ వేదికగా పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ కోసం ఇవాళ్టి నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళనలు చేపట్టనుంది. ఈ ఆందోళనలో భాగంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దీక్ష చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నేటి నుంచి వారం రోజులపాటు జరగనుంది. కుటుంబసభ్యులతో ఆయన థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు సోమవారం సాయంత్రం వెలువడనున్నాయి. తెలంగాణ: తెలంగాణ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష ఈ నెల 15వ తేదీన జరగనుంది. సోమవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు విశాఖ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు కోల్‌కతా వేదికగా కోల్‌కతా, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష నీట్‌పై వివిధ రాష్ట్రాల అధికారులు, ఎంసీఐతో శనివారం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. తమిళనాడు: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. హైదరాబాద్: ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటుచేసిన సీఆర్ కమలనాథన్ కమిటీ మరోసారి శనివారం భేటీ కానుంది. దీనికి కమిటీ చీఫ్ కమలనాథన్, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ: నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్,ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం కర్నూలు,వైఎస్సార్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కార్యవర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు తలశిల రఘురాం, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు వేదికగా బెంగళూరు, పుణె జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు మొహాలీ వేదికగా పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూఢిల్లీ: నేడు ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల దినోత్సవం(మేడే) జరుపుకుంటున్నారు. దేశ ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు లు కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటిస్తున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్-2016 తొలి విడత (నీట్-1) పరీక్ష ఆదివారం జరగనుంది. హైదరాబాద్: రవీంద్రభారతిలో జరిగే మేడే ఉత్సవాలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లతారు. ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు పుణే వేదికగా పుణే జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
పశ్చిమబెంగాల్: నేడు పశ్చిమబెంగాల్ ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం శనివారం జరగనుంది. పలు కీలక బిల్లులపై సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రెండో రోజు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ లా సెట్-2016 దరఖాస్తుల గడువు శనివారంతో ముగిస్తుంది. అపరాధ రుసుం లేకుండా నేటితో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగును. స్పోర్ట్స్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సెమీ ఫైనల్ శనివారం జరుగనుంది. చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తలపడనుంది. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్: నేడు ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటలకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటలకు మెడికల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్‌కు సెట్ కోడ్ జీ-2 ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతినివ్వరు. ఆంధ్రప్రదేశ్: గుంటూరులో శుక్రవారం నుంచి అంతర్జాతీయ నృత్యోత్సవాలు జరగనున్నాయి. నృత్యోత్సవాలతో గుంటూరు నగరం కొత్తశోభను సంతరించుకోనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ: రాష్ట్రంలో కరువుపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కరువు సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు. తెలంగాణ: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు ప్రధాన పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి సుచరితారెడ్డి నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీష్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. నార్లాపూర్, ఏదుల సహా ఆరు ప్యాకేజీ పనులను మంత్రి ప్రారంభిస్తారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు పుణే వేదికగా రైజింగ్ పుణే, గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్: పీఎస్ఎల్వీ సీ-33 రాకెట్ కౌంట్‌డౌన్ నిర్విరామంగా కొనసాగుతోంది. శ్రీహరికోటలో గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు నింగిలోకి ప్రవేశపెడతారు. 1425 కిలోల ఐఆర్ఎన్ఎస్ఎస్ -వన్ జీ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్షలోకి తీసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్: రాజధాని ప్రాంత రైతుల నుంచి ప్లాట్ల కేటాయింపు కోసం ఆప్షన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి 29 గ్రామాల్లో ఫారాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. హైదరాబాద్: నేటి నుంచి సాక్షి ప్రధాన సంచికలో రెండు పేజీల 'భవిత' అందించనున్నారు. తెలంగాణ: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం భేటీకానుంది. పాలేరు ఉప ఎన్నికలో అనూసరించాల్సిన వ్యూహాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తారు. తెలంగాణ: భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బెంగళూరులో పర్యటించనున్నారు. రాజోలిబండపై కర్ణాటక ప్రభుత్వంతో హరీష్ బృందం చర్చిస్తుంది. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా గురువారం రాత్రి 8 గంటలకు ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుంది న్యూఢిల్లీ: సాగరమాల పథకంపై కేంద్రప్రభుత్వం నేడు సమీక్ష నిర్వహిస్తుంది. న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్రకేబినేట్ సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, పలు కీలక అంశాలపై చర్చిస్తారు. తెలంగాణ: నేడు ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. దీంతో ఖమ్మం పట్టణమంతా గులాబీమయం అయ్యింది. ఆ పార్టీ ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటలకు ప్లీనరీ, సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్లీనరీలో 15 అంశాలపై తీర్మానాలు చేస్తారు తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరవుపై మండల కేంద్రాల్లో నేటి నుంచి టీ.కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇసుజీ మోటర్స్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా బుధవారం రాత్రి 8 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సేవ్ డెమొక్రసీ ఉద్యమం ఢిల్లీకు చేరుకుంది. మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి,శరద్ యాదవ్‌లతో వైఎస్ జగన్ బృందం సమావేశం కానున్నారు. టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను ఢిల్లీ నేతలకు వివరించనున్నారు. న్యూఢిల్లీ: భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం మంగళవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చిస్తారు. తెలంగాణ: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. బ్యాలెట్ ద్వారా పాలేరు ఉప ఎన్నిక నిర్వహించాలని, ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీకి అనుమతి ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను ఉత్తమ్ కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్: శ్రీహరికోటలో మంగళవారం పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభంకానుంది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్: తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. హైదరాబాద్: నేడు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పుణే జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూఢిల్లీ: ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు వైఎస్ జగన్ బృందం ఢిల్లీలో పర్యటిస్తారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును, నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్న తీరును రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులతో పాటు వివిధ జాతీయ పార్టీల నేతలను కలుసుకుని వివరించనున్నారు. న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉత్తరాఖండ్‌తో పాటు పలు కీలక అంశాలపై పార్లమెంట్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశముంది. న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా బరిలో 345 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తెలంగాణ: ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్: నేటి నుంచి మన తెలంగాణ-మన వ్యవసాయం రైతు చైతన్య యాత్రలను వ్యవసాయాధికారులు ప్రారంభిస్తారు. ఈ యాత్రల్లో ఖరీఫ్‌పై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ తాత్కాలిక సచివాలయ భవనానికి వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తెల్లవారు జామున ప్రారంభోత్సవం చేశారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ తన మనసులో మాటను వెల్లడిస్తారు. న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం జరపనున్నారు. పంచాయతీ రాజ్ శాఖాధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఆదివారం జరగనుంది. రేపటి నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ: తెలంగాణ రాష్ర్ట పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు ఆదివారం జరుగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జంట జిల్లాలో జరిగే ఈ పరీక్షలకు 94,477 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో 74 పరీక్ష కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌తో సహా 124 పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్: సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరగనుంది. హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో ఈ అవార్డులను బహుకరించనున్నారు. సుప్రసిద్ధులైన న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన పలు రంగాల్లోని ప్రముఖులు, నిష్ణాతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్: నేటి నుంచి ఆన్లైన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు పుణే వేదికగా రైజింగ్ పుణే, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ‘సేవ్ డెమొక్రసీ’ నిర్వహించనుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమాలకు వామపక్షాలతో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు. హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం శనివారం భేటీకానుంది. ఉదయం 11 గంటలకు గోల్కొండ హోటల్లో జరిగే సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం చీఫ్ జస్టిస్, న్యాయమూర్తుల సమావేశానికి ఆయన హాజరవుతారు. హైదరాబాద్: నేడు హజ్‌హౌస్‌లో గురుకుల వెబ్‌సైట్‌ను డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పెదవేగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈపీఎఫ్ తో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్: నేడు వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం జరుగును. రాత్రి 8గంటలకు జరిగే స్వామి వారి కల్యాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. కడపలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించడంతో పాటు రామ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. బుధవారం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీలో మూడు కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. చందన్న సంచార చికిత్స వాహనాలు, ప్రభుత్వాస్పత్రుల్లో సిటీ స్కాన్, రోటా వైరస్ వ్యాక్సిన్లను ఆయన ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్: గుంటూరులో బుధవారం కాంగ్రెస్ బహిరంగసభ జరగనుంది. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను పీసీసీ ప్రకటిస్తుంది. హైదరాబాద్: ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులు రిలే దీక్షలకు దిగనున్నారు. ఇందిరా పార్క్ వద్ద నేటి నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహిస్తారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9లో భాగంగా ముంబై ఇండియన్స్, బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరుగును. -
టుడే న్యూస్ అప్డేట్స్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మంగళవారం పర్యటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కరవుపై ఆయన చర్చించనున్నారు. న్యూఢిల్లీ: నేడు జమ్మూకశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకుల సమావేశం కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరుగనుంది. ఈ సమావేశంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వ నిర్లక్ష్యం, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని సర్కార్ ఆదుకోకపోవడం వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. తెలంగాణ: నేటి నుంచి తెలంగాణలో టీడీపీ బృందం కరవు పరిశీలన చేయనుంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ దృష్టికి తీసుకువెళ్లతారు. విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు మంగళవారం ఉదయం10 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. తొలిసారిగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. విజయవాడ: నేడు విజయవాడలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మహిళా సర్పంచులు హాజరవుతారు. తిరుమల: నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయాధికారులు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్: ఐపీఎల్-9లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. -
టుడే న్యూస్ అప్డేట్స్
హైదరాబాద్: భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు హైదరాబాద్ రానున్నారు. రైతు సంఘం జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్: నేటి నుంచి 18 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాజధాని భూ కుంభకోణం, ప్రజా సమస్యలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీయనుంది. ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో మహిళా ప్రజాప్రతినిధుల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలకు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మహిళా ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించే అవకాశముంది. హైదరాబాద్: ఉప రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఇవాళ జరగాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. హైదరాబాద్: తెలంగాణలో లా సెట్-2016 నోటిఫికేషన్ శనివారం విడుదలకానుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 10వ తేదీ వరకు అనుమతిస్తారు. మే 24న పరీక్ష జరగనుంది. ఢిల్లీ: నేడు ఢిల్లీలో జరగనున్న జలవనరుల సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. హైదరాబాద్: గచ్చిబౌలిలో 'వైట్ సెన్సేషన్' ప్రపంచస్థాయి డ్యాన్స్ ఈవెంట్ జరగనుంది. స్పోర్ట్స్: నేడు ప్రొకబడ్డీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 9 గంటలకు జరిగే మ్యాచ్‌లో యు ముంబాతో పట్నా తలపడనుంది. -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో గురువారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సమావేశంకానున్నారు. పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడంపై కసరత్తు చేస్తారు. రాహుల్‌ను కలిసే వారిలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేవీపీ, జేడీ శీలం, సుబ్బరామిరెడ్డి తదితరులు ఉన్నారు. ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆభరణాల వర్తకుల సమ్మె రెండో రోజుకు చేరింది. బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం పెంపును వ్యతిరేకిస్తూ వర్తకులు మూడు రోజులు సమ్మెకు పిలుపునిచ్చారు. హైదరాబాద్: హైదరాబాద్‌లో ఒడిశా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల బృందం పర్యటించనుంది. ఈ బృందం జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, డిప్యూటి మేయర్లతో భేటీ కానున్నారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయనున్నారు. హైదరాబాద్: నేటి నుంచి మూడు రోజుల పాటు కిసాన్ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ సభల్లో రైతు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో పర్యటిస్తారు. బీజేపీ, టీడీపీలు ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నాయి. రాజమండ్రి: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు నేతలు సమావేశంకానున్నారు. స్పోర్ట్స్: ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ యూఏఈతో భారత్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7గంటలకు జరుగుతుంది. -
టుడే అప్ డేట్స్
ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడతారు. ఆర్ధిక, రైల్వే బడ్జెట్లతో పాటు పలు కీలక అంశాలపై విపక్షాలకు మోదీ సమాధానం చెప్పనున్నారు. ఢిల్లీ: నేటి నుంచి మూడు రోజుల పాటు ఆభరణాల వర్తకులు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం పెంపును వ్యతిరేకిస్తూ వర్తకులు సమ్మె చేయనున్నారు. హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. తెలంగాణలో సెట్ 'సీ', ఆంధ్రప్రదేశ్ లో సెట్-3 ప్రశ్నాపత్రాలను ఎంపిక చేశారు. ఇంటర్ పరీక్షల్లో ప్రప్రథమంగా ఈ ఏడాది నుంచే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన క్యాబినేట్ భేటీకానుంది. రాష్ట్ర బడ్జెట్, శాసనసభ సమావేశాలపై చర్చించనున్నారు. విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపుదలపై రాష్ట్రప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. అభిప్రాయ సేకరణ అనంతరం విద్యుత్ వడ్డనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. శ్రీకాళహస్తి: నేటి నుంచి శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్త కన్నప్ప ధ్వజరోహనంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. స్పోర్ట్స్: ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7గంటలకు జరుగుతుంది. -
టుడే న్యూస్ అప్ డేట్స్
మొదటిసారి రష్యాకు: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రష్యాకు బయలుదేరి వెళ్లనున్నారు. మోదీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఈ పర్యటనలో భారత్- రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు రక్షణ, అణుఇంధన, ఆర్థిక అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. నేటితో 'శీతాకాలం' సరి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొదటి మూడురోజులు రాజ్యాంగం చర్చ తర్వాత పలు వివాదాస్పద అంశాలతో సభ సజావుగా జరగని సంగతి తెలిసిందే. చివరిరోజైన బుధవారమైనా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. స్పీకర్ పై అవిశ్వాసం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేడు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్నది. ఉదయం 10:30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేయనున్నారు. కేసీఆర్ మెగా యాగం: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తలపెట్టిన ఆయుత మహాచండీ యాగం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 8:10 గంటలకు క్రతువు మొదలవుతుంది. ఈ నెల 27 వరకు జరగనున్న ఈ యాగానికి పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. తొలిరోజు గవర్నర్ నరసింహన్ తోపాటు హైకోర్టు చీఫ్ జస్టీస్ బొసాలే రానున్నారు. పీవీ వర్ధంతి: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి జ్ఙానభూమి(నెక్లెస్ రోడ్డు) వద్ద ఉదయం 9 గంటల నుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లక్ష ఉద్యోగాల సంకల్ప దీక్ష: టీఆర్ఎస్ ప్రభుత్వ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ విస్మరణకు గురైందని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నేటి నుంచి లక్ష ఉద్యోగాల సంకల్ప దీక్షను ప్రారంభించనున్నారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
'బాల' కీచకులపై కీలక నిర్ణయం: నిర్భయ కేసులో బాలనేరస్తుడి విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో బాలనేరస్తుల చట్టం సవరణ బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెడ్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 8, 10, 11 తేదీల్లో రాజ్యసభ ఎజెండాలో ఈ బిల్లు ఉందని, అయితే, సభను కాంగ్రెస్ అడ్డుకోవడంతో దీనిపై చర్చ సాధ్యం కాలేదని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.బిల్లు ఆమోదం పొందితే అసాధారణ నేరాలకు పాల్పడ్డ 16 ఏళ్ల బాలలకు కూడా పెద్దలకు విధించే శిక్షలు అమలుచేసే అవకాశం ఉంటుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ బాయికాట్ చేయడంతో ఏకపక్షంగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. స్టాక్ సెక్యూరిటీల అమ్మకం: నిధులు సమకూర్చుకునేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం నేడు స్టాక్ సెక్యూరిటీలను వేలానికి ఉంచనుంది. 10 ఏళ్ల కాలానికిగానూ సెక్యూరిటీలను వేలయం వేయనున్నట్లు తెలిసింది. బీదర్ కు రాష్ట్రపతి: ప్రస్తుతం శీతాకాలవిడిదిలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు కర్ణాటకలోని బీదర్ లో పర్యటించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ: వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్, మహిళా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, అసెంబ్లీ సమావేశాల బాయికాట్, భవిష్యత కార్యాచరణ తదితర అంశాలపై చర్చజరిగే అవకాశంఉంది. 'మహా'తో చర్చలు: తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చర్చలు జరిపేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బృందం నేడు ముంబై వెళ్లనుంది. మహారాష్ట్ర నీటిపారుదల మంత్రితో హరీశ్ బృందం చర్చలు జరపనుంది. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు: డీడీసీఏలో అక్రమాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు తదితర కీలక విషయాలను చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల దర్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా నేటి రాత్రి నుంచి ఆలయాన్ని మూసేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా 83,103 మంది స్వామివారిని దర్శించుకున్నారు. -
టుడే న్యూస్ అప్ డేట్స్
అమరావతి భూములు ప్రైవేట్ సంస్థలకు: ఆదివారం విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభంకానున్నాయి. రాజధాని ప్రాంత భూములను సింగపూర్ ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కీలకమైన బిల్లుకు సోమవారం సభ ఆమోదం తెలపనుంది. ఈ బిల్లును ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు కూడా నేడే ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 3 రోజులు.. 18 బిల్లులు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. సోమవారం(నేటి)తో కలిపి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో పెండింగ్ లో ఉన్న 18 కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకానున్నాయి. అసహనం, ఢిల్లీ సీఎం ఆఫీసులో సీబీఐ తనిఖీలు, నేషనల్ హెరాల్డ్ అంశాలపై చెలరేగిన ఆందోళనలతో సభాకార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో సోమవారం నుంచైనా సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు పార్టమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మూడు రోజులు సభ సజావుగా జరిగితే జాతీయ జలమార్గాలు, నేపాల్ తో సంబంధాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎంపై పరువునష్టం దావా: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)లో చోటుచేసుకున్న అక్రమాల విషయంలో తనతోపాటు తన కుటుంబసభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఆ మేరకు కేజ్రీవాల్ పై నేడు పరువునష్టం దావా వేయనున్నారు. పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ కేసు, ఢిల్లీ హైకోర్టులో సివిల్ కేసులు దాఖలు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ముందస్తు నోటీసులు లేకుండా కేసులెలా పెడతారంటూ ఆప్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఫాం హౌస్ కు కేసీఆర్: తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు నేడు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. నేటి నుంచి చండీ యాగం పూర్తయ్యేంత వరకు ఆయన అక్కడే ఉంటారు. సీఎం కేసీఆర్ ఈ నెల 23 నుంచి 27 వరకు ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. భక్త వైకుంఠం: నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, భద్రాద్రి, యాదాద్రి ఆలయాల్లో ఉత్తరద్వారం ద్వారా స్వామివార్లు దర్శనం దర్శనమిచ్చారు. తిరుమల మాఢావీధుల్లో ఉదయం 9గంటలకు స్వర్ణ రధంపై శ్రీవారు ఊరేగనున్నారు. బాలనేరస్తుడి విడుదల: ప్రపంచవ్యాప్తంగా సంచనం సృష్టించిన నిర్భయ కేసులో శిక్షపూర్తిచేసుకున్న బాలనేరస్తుడు ఆదివారం విడుదలయ్యాడు. అతడి విడుదలపై ఢిల్లీ మహిళా కమిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. -
టుడే న్యూస్ అప్ డేట్స్
వర్ష సూచన: ఏపీలోని రాయసీమ, కోస్తాంధ్ర ప్రాంతానికి మళ్లీ వర్షం ముప్పు పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం స్థిరంగా కొనసాగుతుండటం, దానికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలోని ఐదు జిల్లాల్లో భారీ ఎత్తున పంటలు నీటమునిగిన సంగతి తెలిసిందే. మంత్రులు, అధికారులతో సీఎం భేటీ: స్థూల ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మంత్రులు, శాఖల హెచ్ వోడీలతో సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. సాక్షి ప్రాపర్టీ షో: నేటి ఉదయం 10 గంటలకు తాజ్ బంజారా హోటల్ వేదికగా సాక్షి ప్రాపర్టీ షో ప్రారంభంకానుంది. ఈ షోలో 50కి పైగా స్టాళ్లు ఏర్పాటుచేయనున్నారు. -
న్యూస్ అప్డేట్స్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా లోక్‌సభలో రాజ్యాంగంపై చేపట్టిన ప్రత్యేక చర్చ నేడు కూడా కొనసాగనుంది. డిసెంబర్ 23 వరకు జరగనున్న సమావేశాల్లో తొలి రెండు రోజులూ ప్రత్యేక చర్చ చేపట్టిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు పరామర్శ: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరమార్శిస్తారు. తూర్పుగోదావరిలోని కొత్తపేట నియోజకవర్మం దేవరాపల్లి, ఈతకోట, పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, దువ్వ తదితర ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది. టీ- రిపోర్ట్: రైతు ఆత్మహత్యల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కరువు పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం నేడు కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది. సుల్తాన్ బజార్ బంద్: మెట్రో రైలు ఎలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రఖ్యాత సుల్తాన్ బజార్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఆందోళన ఉధృతం చేశారు. నేడు సుల్తాన్ బజార్ బంద్ కు పిలుపునిచ్చారు. అంగన్ వాడీల పోరు: వేతనాలు పెంచాలడి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అంగన్ వాడీ కార్యకర్తలు నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. క్రికెట్ లో కొత్త అధ్యాయం: క్రికెట్ చరిత్ర నేడు కొత్త మలుపు తీసుకోనుంది. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ డే- నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య నేటి ఉదయం(భారత కాలమానం ప్రకారం 9:30 గంటలకు) ప్రారంభమయ్యే మ్యాచ్ లో తొలిసారి గులాబి రంగు బంతుల్ని వినియోగిస్తుండటం విశేషం. వరల్డ్ హాకీ లీగ్: రాయ్ పూర్ వేదికగా నేటి నుంచి వరల్డ్ హాకీ లీగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో భారత్- అర్జెంటీనాలు తలపడనున్నాయి. -
న్యూస్ అప్ డేట్స్
గెలుపు ఎవరిది: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా విజేత ఎవరో తేలనుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి నుంచి మూడురోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. టీటీడీపీ సమావేశం: విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలువురు టీటీడీపీ సీనియర్లు పాల్గొంటారు. -
న్యూస్ డైరీ
వరద ప్రభావిత ప్రాంతాలకు వైఎస్ జగన్: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో నేడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బాధితులను ఆయన పరామర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన: కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు నేడు సొంత జిల్లా విజయనగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సత్యసాయి జయంతి: భగవాన్ సత్యసాయి 90వ జయంతి నేడు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని సత్యసాయి ఆశ్రమంలోని హిల్ వ్యూ స్టేడియంలో వేడుకలు ఘనంగా నిర్వహించేంకు ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లుచేశారు. ఈ వేడుకలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తిరుమల: నేడు త్రైసిక ద్వాదశి ద్వాదశి సందర్భంగా మాడావీధుల్లో శ్రీవారు.. ఉగ్రశ్నీనివాసుడిగా ఊరేగనున్నారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
మోదీ కశ్మీర్ పర్యటన: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్నారు. శ్రీనగర్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. మన్యం బంద్: విశాఖజిల్లా మన్యం ప్రాంతంలో నిర్వాసితుల గోడు పెడచెవిన పెడుతూ కొసాగుతున్న బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ అఖిలక్షం నేడు మన్యం బంద్ కు పిలుపిచ్చింది. చెన్నైకి చంద్రబాబు: ఎస్ఆర్ఎం వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు చెన్నై వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య పెంపుపై దాఖలపై పిటిషన్ ను నేడు హైకోర్టు విచారించనుంది. ఏపీ ఉద్యోగులు: జూన్ 2 కల్లా నూతన రాజధాని అమరావతికి రావాలని ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో నేడు ఏపీ సచివాలయ ఉద్యోగులు సమావేశమై చర్చించనున్నారు. టీటీడీపీ: వరంగల్ ఉప ఎన్నిక, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం తదితర అంశాలపై చర్చించేందుకు నేడు టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. మొహాలీ టెస్ట్: ఫ్రీడం సిరీస్ లో భాగంగా భారత్- సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట నేడు కొనసాగనుంది. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 142 పరుగుల ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. -
నేటి వార్తావిశేషాలు
చైనా ఉపాధ్యక్షుడి పర్యటన: ఐదురోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 3న భారత్ కు విచ్చేసిన చైనా ఉపాధ్యక్షుడు లీ యువాన్ చావ్.. శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీలతో లీ యువాన్ భేటీలు జరపనున్నారు. గడిచిన నాలుగురోజుల్లో ఆయన మహారాష్ట్ర, కోల్ కతాల్లో జరిగిన పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఒక చైనా ఉపాధ్యక్షుడు భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం ఢిల్లీ ఆర్థిక సదస్సు: 'రియలైజింగ్ ఇండియా' థీమ్ తో నేటినుంచి ప్రారంభం కానున్న ఢిల్లీ ఆర్థిక సదస్సు- 2015ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సీఎం, మంత్రుల ఢిల్లీ పర్యటన: నాలుగు రోజుల కిందటే ఢిల్లీ వెళ్లొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నేడు మరోసారి హస్తినబాట పట్టనున్నారు. శుక్రవారం చంద్రబాబు ఢీల్లీకి పయనం కానున్నారు. మరోవైపు హోం, వైద్యారోగ్య శాఖల మంత్రులు కూడా దేశరాజధానికి పయనమయ్యారు. మంత్రి కామినేని.. మంగళగిరి ఎయిమ్స్ కు సంబంధించిన విషయాలపై కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడనున్నరు. హోం మంత్రి చినరాజప్ప పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కరువు ప్రాంతాలకు వైఎస్సార్ సీపీ నేతలు: ఏపీలో దుర్భర కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నేడు వైఎస్సార్ సీపీ నేతలు పర్యటించనున్నారు. సీపీఎం నిరసనలు: బక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నేడు సీపీఎం నిరసనలు చేపట్టనుంది. తొలి టెస్ట్ రెండో రోజు: ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలిరోజు బ్యాటింగ్ కుదిన భారత్ 201 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 28 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండుకున్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
టుడే న్యూస్ అప్డేట్స్
కాంగ్రెస్ నిరసన ర్యాలీ: దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు కీలక నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బాబు ఢిల్లీ పర్యటన: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సొంత నియోజకవర్గంలో కేటీఆర్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్నారు. వాటర్ గ్రిడ్ పథకంపై సమీక్ష నిర్వహించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అయ్యన్న విశాఖ పర్యటన: ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేడు విశాఖపట్టణం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. -
నేటి వార్తావిశేషాలు
వైఎస్సార్ సీపీ సమరభేరి: పెరిగిన నిత్యావరసరాల ధరలపై వైఎస్సార్ సీపీ సమరభేరి మోగించింది. ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నేడు ఏపీలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుల ఆందోళనలు నిర్వహించనుంది. విద్యార్థులపై దాడికి నిరసన: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన విద్యార్థి జేఏసీ నాయకులపై విజయవాడలో బీజేపీ నేతల దాడిని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నేడు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మిషన్ కాకతీయ ఫేస్- 2: చెరువుల పుణరుద్ధరణ కోసం తెలంగాణ సర్కార్ ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం ఫేస్-2పై ఇంజనీర్లతో నేడు వర్క్ షాప్ జరగనుంది. జేఎన్టీయూలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులు పాల్గొననున్నారు. ఏపీ కేబినెట్ భేటీ: రాజధాని భూముల అంశం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలే ప్రధాన ఎజెండాగా నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. వీరీవీరీ గుమ్మడిపండు..: కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెలంగాణ బీజేపీ నేడు తెరదించనుంది. వరంగల్ ఉప ఎన్నికలో బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది నేడు ప్రకటించనుంది. దేవయ్య, చింతా స్వామి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నామినేషన్లు: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య, వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. -
నేటి వార్తావిశేషాలు
న్యాయమూర్తుల నియామకాలు ఎలా?: వివాదాస్పదంగా మారిన ఎన్‌జేఏసీ (నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్) ఏర్పాటుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువర్చనుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు తదితర న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు ఇన్నాళ్లూ అనుసరించిన కొలీజియం విధానం స్థానే మోదీ సర్కారు ఎన్‌జేఏసీ విధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. రెండో దశ: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఆరు జిల్లాల్లోని మొత్తం 32 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తిచేసింది. మొదటి దశలో 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 12న పోలింగ్ జరిగిన సంగతి విదితమే. మూడో దశ 28న, నాలుగో దశ నవంబర్ 1న, ఐదో దశ నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. వెల్ కం చైనా: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయమై పలువురు చైనా ప్రతినిధులతో నేడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక సమావేశం జరపనున్నారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
మెడికల్ షాపుల బంద్: ఆన్ లైన్ లో మందుల అమ్మకానికి అనుమతుల మంజూరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మెడికల్ షాపులు నేడు మూతపడనున్నాయి. కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్ షాపులు, జీవన్ దాన్ తదితర సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. నిరసన మార్చ్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు నేడు విజయవాడలో నిరసన మార్చ్ నిర్వహించనున్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు మార్చ్ చేస్తారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను బాబు సర్కార్ భగ్నం చేయడంతో పోరును ఉదృతం చేయడంలో భాగంగా పార్టీ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. బోస్ బంధుగణంతో: గతంలో హామీ ఇచ్చినమేరకు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులతో నేడు సమావేశం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాబు ఢిల్లీ పర్యటన: స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ ఉప సంఘం రూపొందించిన నివేదికను ప్రధానికి అందజేయడంతోపాటు పలువురు ముఖ్యులను ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యహ్నం 12:30కు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. కేసీఆర్ గజ్వేల్ పర్యటన: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఈ రోజు పర్యటిస్తారు. వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభిస్తారు. కోదండరాం పిటిషన్: తెలంగాణలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలపై జేఏసీ చైర్మన్ కోదండరామ్ దాఖలు చేసినఇంప్లీడ్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ. టీడీపీ- బీజేపీ ధర్నా: తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ- బీజేపీలు బ్యాంకుల ముందు ధర్నా పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం నేడు కూడా కొనసాగనుంది. రెండో వన్ డే: గాంధీ- మండేలా సిరీస్ లో భాగంగా భారత్- దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య ఇండోర్ లో రెండో వన్ డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ కోల్పోవడంతోపాటు మొదటి వన్ డేలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ సేన తీవ్ర ఒత్తిడిలో ఉంది. తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నేటినుంచి నవరాత్రి బహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీశైలం: శ్రీశైలంలో రెండో రోజూ కొనసాగనున్న దేవీ శరన్నవరాత్రులు -
టుడే న్యూస్ అప్డేట్స్
► నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ ఉభయ సభలు ► నేడు తెలంగాణ శాసనసభలో రైతు ఆత్మహత్యలపై చర్చ ► నేటినుంచి రెండు రోజుల పాటు నోవాటెల్‌లో అఖిలభారత విప్స్ కాన్ఫరెన్స్ ► నేడు అఖిలభారత విప్స్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ► తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై చేసిన పిల్, నేడు విచారించనున్న హైకోర్టు ధర్మాసనం ► నేడు గద్వాల బంద్‌కు పిలుపునిచ్చిన జిల్లా సాధన సమితి ► నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ► నేడు ఉదయం 7 గంటలకు మరోసారి భేటీ కానున్న సీఎం చంద్రబాబు ►నేడు ఆర్బీఐ పరపతి విధాన పరీక్ష, రెపో రేటు తగ్గింపు అవకాశం ► నేడు పశ్చిమగోదావరి జిల్లాలో నారా లోకేశ్ పర్యటన -
టుడే న్యూస్ అప్డేట్స్
టీ అసెంబ్లీ సమరం: బుధవారం ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలి కొలువుదీరనున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దివంగత ఎమ్మెల్యే కృష్ణారెడ్డిలకు సంతాపం ప్రకటించనున్న ఉభయ సభలు. అనంతరం ఐదు రోజుల సెలవు ప్రకటన. 29 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభం కీలక పర్యటన: ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఐర్లాండ్ బయలుదేరి వెళ్లారు. 60 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న మొదటి భారత ప్రధాని ఆయనే కావటం విశేషం. ఐర్లాండ్ నుంచే అమెరికాకు చేరుకోనున్న మోదీ.. ఐక్యరాజ్యసమితి 70వ వార్శిక సమావేశంలో పాల్గొంటారు. ఢిల్లీలో బాబు: సింగపూర్ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. పరామర్శయాత్ర: నేడు కరీంనగర్ జిల్లాలో రెండోరోజూ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర. మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల్లోని ఆరు కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు తిరుమలలో శ్రీవారి రథోత్సవం కార్యక్రమం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి వేడుక ప్రారంభం కానుంది. సెట్ స్లైడింగ్: సీట్ల కేటాయింపు పూర్తయినట్లు ఎస్ఎమ్ఎస్ వచ్చిన విద్యార్థులకు బుధ, గురువారాల్లో సెట్ స్లైడింగ్ నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. -
టుడే న్యూస్ అప్డేట్స్
పీఎం ఉత్తరాది పర్యటన: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మూడు ఉత్తరారి రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛండీగఢ్ లలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. వంశధార ట్రిబ్యూనల్ పర్యటన: నేడు ప్రకాశం బ్యారేజీని సందర్శించనున్న వంశధార ట్రిబ్యూనల్. ముగ్గురు సీనియర్ జడ్జిలు సహా 17 మంది న్యాయవాదులు బ్యారేజీని పరిశీలిస్తారు. చైనాలో కేసీఆర్: పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధేయంగా కొనసాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చైనా పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. షర్మిల పరామర్శయాత్ర: వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. కామారెడ్డిపల్లె, మల్లక్కపేట, నాగారం, లక్ష్మీపురం, ఇసిపేట, జంగేడు గ్రామాల్లో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువుచాలించినవారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. కేశవరెడ్డి కేసు: విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన కేసులో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన సమీక్షకోసం ఏపీ డీజీపీ జేవీ రాముడు, సీఐడీ చీఫ్ లు నేడు కర్నూలు వెళ్లనున్నారు. వానలే వానలు: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నది. రేపటి నుంచి మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. యూఎస్ ఓపెన్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో శుక్రవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరగాల్సిన మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్ లు వర్షం కారణంగా వాయిదా పడ్డాయి. సాయంత్రానికి మ్యాచ్ లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కూడా ఈరోజే జరగనుంది. -
ఈ రోజు వార్తావిశేషాలు
కేంద్ర క్యాబినెట్ భేటీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మరోసారి స్వల్పకాలిక పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం. హిందీ మహాసభలు: భోపాల్ నగరంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు జరిగే 10 వ హిందీ మహాసభలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులతోపాటు పలువురు హిందీ భాషా కోవిదులు ఈ సభలకు హాజరవుతారు. కేసీఆర్ కీలక ప్రసంగం: చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. నేడు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో కీలక ప్రసంగం చేయనున్నారు. 10 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 7న కేసీఆర్ బృందం చైనా వెళ్లడం తెలిసిందే. రైతు కోసం చంద్రన్న: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'రైతు కోసం చంద్రన్న' పేరుతో సరికొత్త యాత్రకు శ్రీకారం చుట్టారు. నేడు శ్రీకాకుళం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 29న అనంతపురంలో ముగియనుంది. పురస్కారం ప్రదానం: భారత అంతరీక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు మహాత్మాగాంధీ జాతీయ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన దరిమిలా.. బుధవారం ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఇస్రో ప్రతినిధులకు అవార్డును ప్రదానం చేయనున్నారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన: ఏపీ స్థానికత కారణంగా తెలంగాణ ప్రభుత్వ విధుల నుంచి బహిష్కరణకు గురైన 1200 మంది విద్యుత్ ఉద్యోగులు నేటి నుంచి ఆందోళనలు నిర్వహించనున్నారు. -
నేటి వార్తావిశేషాలు
పారిశ్రామికవేత్తలతో ప్రధాని: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఢిల్లీ వేదికగా సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సీడబ్ల్యూసీ భేటీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి కమిటీగా భావించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. పార్టీ జాతీయ కార్యాలయంలో జరగబోయే భేటీలో సోనియా గాంధీ అధ్యక్ష పదవీకాలం పొడగింపు, మోదీ పాలన సహా పలు సంస్థాగత విషయాలపై చర్చిస్తారని తెలిసింది. రాజ్‌నాథ్ రాక: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో జరిగే జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. చైనాలో కేసీఆర్: చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు తన బృందంతో కలిసి దనియల్ పట్టణాన్ని సందదర్శిస్తారు. సాయంత్రం భారత వాణిజ్య, వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. రెండోరోజు షర్మిల పరామర్శయాత్ర: వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువుచాలించిన వరంగల్ జిల్లా వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర రెండోరోజూ కొనసాగనుంది. ఏపీలో వర్సిటీల బంద్: బాబు సర్కారు ప్రవేశపెట్టిన ప్రైవేటు వర్సిటీల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సోమవారం అన్ని యూనివర్సిటీల బంద్ నిర్వహిస్తున్నది. ఫిర్యాదుల పర్వం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్ధానాన్ని విస్మరించిందంటూ అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేడు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించనుంది. డైట్ సెట్ ఫలితాలు: ఏపీ డైట్ సెట్- 2015 పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సర్టిఫికెట్ల పరిశీలన: తెలంగాణలో నిర్వహించిన డీఈఈ సెట్ పరీక్షల్లో అర్హతసాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను నేడు పరిశీలించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోస్టాఫీసుల్లో స్టాంప్ పేపర్ల విక్రయం: తెలంగాణలోని 859 కంప్యూటరైజ్డ్ పోస్టాఫీసుల్లో స్టాంప్ పేపర్ల విక్రయం నేటి నుంచి ప్రారంభంకానుంది. తిరుమల: బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు తిరుమలలో కోయల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా ఉదయం 11 గంటల తర్వాతే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది. నేడు కూడా వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం: అమెరికాలోని లాస్‌వెగాస్ వేదికగా సోమవారం నుంచి వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
టుడే న్యూస్ అప్డేట్స్
వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల నేటి నుంచి వరంగల్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 5 రోజులపాటు సాగనుంది. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువుచాలించిన 31 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. కేసీఆర్ చైనా పర్యటన: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశస్త్రఖర్ రావు నేడు చైనాకు వెళ్లనున్నారు. సోమవారం నుంచి 10 రోజులపాటు సాగే పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సహా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సీఎం వెంట 15 మంది రాజకీయ, అధికారుల బృందం కూడా చైనా వెళ్లనున్నది. ఈ నెల 16న కేసీఆర్ తిరిగి హైదరాబాద్ వస్తారు. ర్యాగింగ్ నిరోధానికి ఉన్నత స్థాయి చర్చలు: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి చేపట్టవలసిన చర్చలను గురించి చర్చించేందుకు అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం హైదరాబాద్ లో భేటీ జరపనుంది. సర్టిఫికెట్ల పరిశీలన: ఉపాధ్యాయ శిక్షణా కోర్సు బీఈడీ ప్రవేశాలలో 2015-16 విద్యా సంవత్సరానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. వర్ష సూచన: ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి ఆనుకుని మరో అల్పపీడణం ఏర్పడింది. దీంతో రాగల 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం -
ఈరోజు వార్తావిశేషాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసన సభ సహా శాసన మండలి కొలువుదీరనున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. సభ ప్రారంభానికి ముందే.. అంటే 8:30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. సభ ఏవిధంగా సాగలనే విషయాలను ఈ కమిటీ చర్చిస్తుంది. పోరుబాటలో ప్రతిపక్షం: ఏపీకి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. పలు అంశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టాలని భావిస్తున్నది. కేవలం ఐదు రోజులు మాత్రమే సభను జరపాలనన్న బాబు సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కనీసం 15 రోఉల పాటైనా సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లనున్నారు. డిగ్గీరాజా పర్యటన: కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మద్యాహ్నం హైదరాబాద్ లో జరగనున్న ఓ సమావేశంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇతర జిల్లాల్లోనూ దిగ్విజయ్ పర్యటించే అవకాశాలున్నాయి. భూ ఆర్డినెన్స్: కేంద్ర ప్రభుత్వం సిఫారసుతో రాష్ట్రపతి ఆమోదించిన భూసేకరణ చట్టం సవరణల బిల్లు ఆర్డినెన్స్ గడువు నేటితో ముగియనుంది. భూ సేకరణపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే విధంగా చట్టంలో నిబంధనలు చేర్చాలనుకున్న దరిమిలా మరోసారి ఆర్డినెన్స్ జారీ చేయబోమని కేంద్రప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. గ్రూప్స్ సిలబస్: గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి తెలంగాన పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీపీఎస్సీ) నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన సిలబస్ నేడు వెల్లడికానుంది. సెప్టెంబర్ లో పరీక్షల ఈ నెలలో పరీక్షల తేదిని ప్రకటించి, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీపీపీఎస్సీ అధ్యక్షుడు ఘంటా చక్రపాణి ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో సిలబర్ ప్రకటన కోసం అభ్యర్థులు ఆత్రుతగా ఎదురుచేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ ధర్నా: మహబూబ్ నగర్ జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో తలెత్తిన ఆలస్యాన్ని నిరసిస్తూ, ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలనే డిమాండ్ తో భారతీయ జనాపార్టీ ఈరోజు ధర్నా నిర్వహించనున్నది. ధర్నాలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు కీలక నేతలూ పాల్గొననున్నారు. పవర్ ప్రొడక్షన్ బంద్: నేటి నుంచి శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. వర్షాభావ పరిస్థితులతో జలాశయంలోకి నీరు చేరకపోవడంతో ఇప్పటికే నీటి నిలువలు అడుగంటాయి. దీంతో సోమవారం నుండి శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టీచర్ల బదిలీలు: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పనిచేస్తోన్న ప్రభుత్వ టీచర్ల బదిలీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మెరిట్ ఆధారంగా బదిలీలు చేపడతామని సంబంధిత అధికారులు ప్రకటించారు. కొలంబో టెస్టు: సింహాళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో 111 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఆట కీలకం కానుంది. వరుణుడు అడ్డుపడకుంటే ఫలితం తప్పక వచ్చే అవకాశాలున్నాయి. యూఎస్ ఓపెన్ టెన్నిస్: నేటి నుంచి యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ప్రారంభం కానుంది. రాత్రి 8:30 గంటలకు మొదటి మ్యాచ్ జరుగుతుంది.