నేటి ముఖ్యవార్తలు | news updates | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యవార్తలు

Published Wed, Apr 12 2017 9:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

news updates

జీఎస్‌టీపై చర్చ
ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినేట్‌ భేటీ కానుంది. బీసీ కమిషన్‌పై నివేదిక, జీఎస్‌టీ బిల్లుల ఆమోదంపై చర్చ జరగనుంది.
 
కేంద్ర కేబినేట్‌ భేటీ
నేడు సాయంత్రం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
 
మిషన్‌ కాకతీయ
మిషన్‌ కాకతీయ అమలవుతున్న తీరుపై నేడు తమిళనాడు అధికారుల బృందంతో తెలంగాణ అధికారులు భేటీ కానున్నారు.
 
హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ గురువారం హైదరాబాద్‌ రానున్నారు. ఉర్దూ వర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
ఇంటర్మీడియెట్‌ ఫలితాలు
రేపు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్న ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి.
 
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
రిజర్వేషన్లపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16న ప్రత్యేకంగా సమావేశం కానుంది.
 
ఐపీఎల్‌-10
నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్‌, రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement