వాడుకున్నప్పుడు వాటా ఇవ్వాల్సిందే.. గూగుల్, ఫేస్‌బుక్‌కు ఫీజు! | Government plans law to make Google, Facebook pay for news | Sakshi
Sakshi News home page

యథేచ్చగా వాడుకుంటున్న గూగుల్‌, ఫేస్‍బుక్‌.. ఇకపై లాభాల్లో వార్తా సంస్థలకు వాటా!

Jul 17 2022 4:08 AM | Updated on Jul 17 2022 8:57 AM

Government plans law to make Google, Facebook pay for news - Sakshi

న్యూఢిల్లీ: సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్, ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లలో వచ్చే వార్తాంశాలపై ఆ సంస్థల నుంచే ఫీజు వసూలు చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలను భారత ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రస్తుతం వార్తా సంస్థల్లో తయారయ్యే వార్తాంశాలను గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలు యథేచ్చగా వాడుకుంటూ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు.

తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆయా వార్తా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం తాజాగా.. వార్తాంశాల ద్వారా వచ్చే ఆదాయంలో వాటాను వార్తా సంస్థలకు అందజేసేందుకు, లేని పక్షంలో ఆయా కంపెనీల నుంచి జరిమానా వసూలు చేసేందుకు ఉద్దేశించిన నిబంధనలకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement