ప్రముఖ టెక్ కంపెనీలు ఆర్ధిక మాంద్యం భయాలతో ఉద్యోగుల్ని ఇష్టానుసారంగా తొలగిస్తున్నా..జీతాలు చెల్లించే విషయంలో ప్రశంసలందుంకుంటున్నాయి.
గత ఏడాది ఏయే కంపెనీలు ఉద్యోగులకు ఎంతమేర జీతం చెల్లించాయని నిర్ధారించేలా వాల్ స్ట్రీట్ జర్నల్ కంపెనీల ఆర్ధిక సమాచారాన్ని విశ్లేషించే కంపెనీ మైలాగ్ఐక్యూ డేటాను పరిగణలోకి తీసుకుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎస్అండ్పీ 500 ఇండెక్స్ కంపెనీల్లో భాగమైన 278 కంపెనీల వేతనాల్ని పరిశీలించారు. అయితే, అనూహ్యంగా ఆ నివేదికలో శాలరీ ఎక్కువ ఇస్తున్న కంపెనీల జాబీతాలో మెటా,గూగుల్‌లో చోటు దక్కించుకున్నాయి.
మైలాగ్ఐక్యూ డేటా ఆధారంగా 2022లో అత్యధిక వేతనాలు చెల్లించిన కంపెనీల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ విసి ప్రాపర్టీస్ 4.15 లక్షల వేతనంతో ఈ జాబితాలో అగ్రస్ధానం, మెటా 3,00,000 డాలర్ల మధ్యస్త వేతనంతో రెండవ స్ధానంలో నిలవగా, 2.8 లక్షల డాలర్ల వేతనంతో ఆల్ఫాబెట్ మూడో ప్లస్‌ను కైవసం చేసుకుంది.
ఇక, గత ఏడాది నవంబర్‌లో మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది మార్చిలో 10,000 మందిపై వేటు వేసింది. మరోవైపు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది జనవరిలో కంపెనీ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment