
ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియా నిబంధనల్ని ఉల్లంఘించిందుకు ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిందని ఆరోపిస్తూ ఐర్లాండ్ రెగ్యులేటర్ రికార్డ్ స్థాయిలో మెటాకు 1.2 బిలియన్ యూరోల (1.3 బిలియన్ డాలర్లు) ఫైన్ విధించింది.
యూరోపియన్ యూనియన్‌కి చెందిన ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) 1.2 బిలియన్ యూరోలను మెటా నుంచి వసూలు చేసే బాధ్యతలను యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ (ఈడీపీబీ)కి అప్పగించింది. ఇక 2020 నుంచి ఫేస్‌బుక్ మాతృసంస్థ ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిన అంశంపై విచారణ ముమ్మరం చేసింది.
ఈ సందర్భంగా మెటా యురోపియన్ కేంద్ర కార్యాలయం డుబ్లిన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కేంద్రం నుంచే మెటా యూజర్లు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించేలా వ్యహరించిందంటూ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ (సీజేఈయూ) అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే ఈ జరిమానాను మెటా వ్యతిరేకించింది. లోపభూయిష్టంగా, అన్యాయంగా ఇచ్చిన తీర్పు ఇతర కంపెనీలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంది. రెగ్యులేటర్ విధించిన జరిమానా, ఇతర అంశాలపై చట్టపరంగా పోరాటం చేస్తామని మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ చీఫ్ లీగర్ అధికారి జెన్నీఫెర్ న్యూస్టెడ్ బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment