న్యూఢిల్లీ: న్యూస్ కంటెంట్ ఆదాయ పంపకంలో సహేతుకంగా వ్యవహరించడం లేదంటూ సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై మరో కేసు దాఖలైంది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్‌బీడీఏ) చేసిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే గూగుల్‌పై కొనసాగుతున్న దాదాపు ఇదే తరహా రెండు కేసులతో కలిపి దీన్ని కూడా దర్యాప్తు చేయాలని పేర్కొంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్, ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ వేర్వేరుగా చేసిన రెండు ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. సీసీఐలో భాగమైన డైరెక్టర్ జనరల్ (డీజీ) ఈ కేసులను దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తారు.
సెర్చి ఇంజిన్‌లో తమ వెబ్‌లింకులు ప్రముఖంగా కనిపించాలంటే గూగుల్ కు తప్పనిసరిగా కంటెంట్ సమకూర్చాల్సి వస్తోందని, కానీ గూగుల్ మాత్రం దీనికి ప్రతిగా అరకొర ప్రతిఫలమే ఇస్తోందని ఎన్‌బీడీఏ ఆరోపిస్తోంది.
చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment