న్యూఢిల్లీ: గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) తమకు జరిమానా విధించడంపై టెక్ దిగ్గజం గూగుల్ స్పందించింది. కనెక్టివిటీకి అడ్డంకులను తొలగించే దిశగా సురక్షితమైన స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేవాల్సిన దశలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం వల్ల దేశీయంగా డిజిటల్ వినియోగం వేగవంతం కాకుండా విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది.
గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విషయంలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ రూ. 1,338 కోట్లు, ప్లే స్టోర్‌కి సంబంధించి అనుచిత విధానాలపై మరో రూ. 936 కోట్ల మొత్తాన్ని సీసీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment