
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) భారీ జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్‌సీఎల్‌ఏటీని టెక్ దిగ్గజం గూగుల్ ఆశ్రయించింది. ఈ ఆదేశాల వల్ల ఆండ్రాయిడ్ భద్రతా ఫీచర్లను విశ్వసించే తమ భారతీయ యూజర్లు, వ్యాపారాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, మొబైల్ పరికరాల రేట్లు పెరిగేందుకు కూడా దారి తీయవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే సీసీఐ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ యూజర్లు.. భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కంపెనీపై సీసీఐ రూ. 1,338 కోట్ల భారీ జరిమానా విధించింది. అలాగే, అనుచిత వ్యాపార విధానాలు మానుకోవాలని కూడా ఆదేశించింది.
చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్!
Comments
Please login to add a commentAdd a comment