Android Tablet
-
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్‌టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీయాపిల్ ఓఎస్‌లోనూ..ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్‌లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్‌ల్లోని హార్డ్‌వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్‌ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్‌లు, డివైజ్‌ల్లోని యాప్‌లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గూగుల్ మ్యాజిక్ ఎడిటర్.. గురించి ఎప్పుడైనా విన్నారా!
పాత పిక్సెల్ ఫోన్లకు ‘మ్యాజిక్ ఎడిటర్’ను తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది. ‘మ్యాజిక్ ఎడిటర్’లో రకరకాల ఇమేజ్ ఎడిటింగ్, ఎన్హాన్స్మెంట్ టూల్స్ ఉంటాయి. ఫొటో రిసైజ్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి, యూనిక్ ఫిల్టర్లను అప్లై చేయడానికి మ్యాజిక్ ఎడిటర్ ఉపయోగపడుతుంది.కొత్త ఫ్రీ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్లు ప్రస్తుతం కొన్ని పిక్సెల్స్ 7, పిక్సెల్స్ 6 సిరీస్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. ‘మ్యాజిక్ ఎడిటర్’తోపాటు ఫొటోఅన్బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, పోట్రాయిట్ లైట్‌లాంటి ఏఐ–పవర్డ్ ఫొటో–ఎడిటింగ్ ఫీచర్లు అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌లకు అందుబాటులోకి రానున్నాయి.యాపిల్ ఐపాడ్ ప్రో 11బాడీ: 249.7“177.5“5.3 ఎంఎం; బరువు: 466 గ్రా.; డిస్ప్లే: 11.00 వోఎస్/సాఫ్ట్వేర్: ఐపాడ్వోఎస్ 17.5; రిజల్యూషన్: 1668“2420; బ్యాటరీ: 7,606 ఎంఏహెచ్; మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్/ 1టీబి 16జీబి ర్యామ్/ 2టీబి 16జీబి ర్యామ్పోకో ఎఫ్ 6..సైజ్: 6.67 అంగుళాలు రిజల్యూషన్: 1220“2712 పిక్సెల్స్బరువు: 179 గ్రా; బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ఇంటర్నల్: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్ కలర్స్: బ్లాక్, గ్రీన్, టైటానియంఇవి చదవండి: సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే! -
ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ తగ్గిందా? ఇదిగో పరిష్కారం!
నేడు ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో మొబైల్ బ్రౌసింగ్ స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎలా క్లియర్ చేయాలి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి మనం మొబైల్ ఫోన్ ఉపయోగించే సమయంలో అనేక బ్రౌజర్లను ఓపెన్ చేస్తుంటాము. అవన్నీ కూడా బ్యాకెండ్‌లో సేవ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే మొబైల్ ఫోన్ వేగం మునుపటి కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత తప్పకుండా స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా? మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపున మూలలో మరిన్ని అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే మెనూలో హిస్టరీ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత 'క్లియర్ యువర్ బ్రౌసింగ్ డేటా' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అందులో ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే అప్పటికి సేవ్ అయిన హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. ఫైల్స్ ఎక్కువగా ఉంటే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, దీని ద్వారా మొబైల్ స్పీడ్ తప్పకుండా పెంచుకోవచ్చు. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) మొబైల్ స్పీడ్ తగ్గింది అనిపించినప్పుడు క్యాచ్ క్రమం తప్పకుండా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్యాచ్ క్లియర్ అనేది కేవలం మొబైల్ ఫోన్‌కి మాత్రమే కాకుండా అప్లికేషన్లకు కూడా వర్తిస్తుంది. దీన్ని కూడా క్లియర్ చేసుకోవడం వల్ల అప్లికేషన్ వేగం పెరుగుతుంది. -
సీసీఐ ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీకి గూగుల్
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) భారీ జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని టెక్ దిగ్గజం గూగుల్ ఆశ్రయించింది. ఈ ఆదేశాల వల్ల ఆండ్రాయిడ్ భద్రతా ఫీచర్లను విశ్వసించే తమ భారతీయ యూజర్లు, వ్యాపారాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, మొబైల్ పరికరాల రేట్లు పెరిగేందుకు కూడా దారి తీయవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ యూజర్లు.. భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కంపెనీపై సీసీఐ రూ. 1,338 కోట్ల భారీ జరిమానా విధించింది. అలాగే, అనుచిత వ్యాపార విధానాలు మానుకోవాలని కూడా ఆదేశించింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
Google: గూగుల్ వాడుతున్నారా? అయితే అర్జెంటుగా..
గూగుల్ తన యూజర్లకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అర్జెంట్‌గా గూగుల్ క్రోమ్‌ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్ -94 అప్డేట్ గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హఠాత్తుగా బుధవారం ఈ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయి, ఐవోఎస్, విండోస్‌తో పాటు మాక్‌ఓస్ వెర్షన్లను సైతం కొత్త ఫీచర్స్‌తో ఒకేసారి అప్డేట్ అందించింది. ప్రైవసీ, కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తూనే క్రోమ్-94.. బగ్స్‌ను(దాదాపు 32) సైతం ఫిక్స్ చేసేసింది గూగుల్. ఇక 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త వెర్షన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్లను వెబ్సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. హాట్‌న్యూస్: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..! మరో విశేషం ఏంటంటే.. ఇది HTTPS-First modeకి సంబంధించిన వెర్షన్. అంటే.. సురక్షితంకానీ వెబ్సైట్లను ఓపెన్ చేసినప్పుడు ఫుల్ పేజీ అలర్ట్‌ను చూపించే వెర్షన్‌గా లేటెస్ట్ అప్డేట్ ఘనత సాధించింది. తద్వారా యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ ప్రకటించుకుంది. వెబ్సైట్ ఆరంభంలో ఉండే హెచ్‌టీటీపీఎస్ అనే లెటర్ష్.. సంబంధిత వెబ్సైట్ అసలా? నకిలీనా? అనే విషయం తెలియజేస్తుందని తెలుసు కదా!. ఒక్కోసారి సురక్షితంకానీ వెబ్సైట్లను సైతం ఓపెన్ కావడానికి క్రోమ్ అనుమతిస్తుంది. అలాంటప్పుడు గతంలో గూగుల్ అలర్ట్ ఏదో నామమాత్రంగానే.. చిన్నగా వచ్చేది. కానీ, ఒక్కోసారి అది గమనించకుండా యూజర్లు ముందుకెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు కొత్త అప్డేట్ ద్వారా ఫుల్‌పేజీ అలర్ట్ ఇస్తారు. తద్వారా యూజర్ మరింత జాగ్రత్త పడొచ్చు. అలాంటి సైట్ల నుంచి వెనక్కి వచ్చేయొచ్చు. ఓవైపు సేఫ్ బ్రౌజింగ్. మరోవైపు వెబ్కోడెక్స్ ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లకు అందించనుంది క్రోమ్ 94. అంటే.. మానిటర్, ఇతర స్క్రీన్ల మీద వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్‌వేర్ డీకొడింగ్ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. చదవండి: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే! ఇదీ చదవండి: ఫోన్ స్టోరేజ్ నిండిందా? డోంట్ వర్రీ.. వీటిలో ట్రై చేయండి -
బుడుగుల కోసం సూపర్ కారు..
పిల్లల కోసం రూపొందించిన లేటెస్ట్ సూపర్ ఎలక్ట్రిక్ కారు ఇది. పేరు ‘బ్రూన్ ఎఫ్8’. కొరియన్ కంపెనీ తయారుచేసిన ఈ కారు మూడు రకాల డ్రైవింగ్ మోడ్లలో నడుస్తుంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో సైతం దీనిని నియంత్రించొచ్చు. కుదుపులు నివారించేందుకు నాలుగు చక్రాలకూ గ్యాస్ సస్పెన్షన్ సిస్టమ్, స్మార్ట్ టచ్‌స్క్రీన్ పవర్ కంట్రోల్, పిల్లల భద్రత కోసం బకెట్ సీట్లు, ఎలక్ట్రానిక్ డిస్క్ బ్రేకుల వంటి ప్రత్యేకతలూ ఉన్నాయి. బ్లూటూత్ రిమోట్ కంట్రోల్‌తో పెద్దవారు కూడా దీనిని బయటి నుంచి నియంత్రించే అవకాశమూ ఉంటుంది. గరిష్టంగా గంటకు 14 కి.మీ. వేగంతో పరుగెత్తే ఈ కారు పిల్లలకు అద్భుతమైన కానుక అని దీని రూపకర్తలు చెబుతున్నారు. అన్నట్టూ.. దీని ఖరీదెంతో తెలుసా..? జస్ట్ వెయ్యి డాలర్లు.. అంటే రూ. 63 వేలే!