నేడు ఆండ్రాయిడ్ ఫోన్‌ల వినియోగం భారీగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో మొబైల్ బ్రౌసింగ్ స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎలా క్లియర్ చేయాలి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి మనం మొబైల్ ఫోన్ ఉపయోగించే సమయంలో అనేక బ్రౌజర్లను ఓపెన్ చేస్తుంటాము. అవన్నీ కూడా బ్యాకెండ్‌లో సేవ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే మొబైల్ ఫోన్ వేగం మునుపటి కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత తప్పకుండా స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా?
- మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి
- క్రోమ్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపున మూలలో మరిన్ని అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- అక్కడ కనిపించే మెనూలో హిస్టరీ ఆప్షన్ ఎంచుకోవాలి.
- తరువాత 'క్లియర్ యువర్ బ్రౌసింగ్ డేటా' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అందులో ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే అప్పటికి సేవ్ అయిన హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. ఫైల్స్ ఎక్కువగా ఉంటే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
- ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, దీని ద్వారా మొబైల్ స్పీడ్ తప్పకుండా పెంచుకోవచ్చు.
(ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!)
మొబైల్ స్పీడ్ తగ్గింది అనిపించినప్పుడు క్యాచ్ క్రమం తప్పకుండా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్యాచ్ క్లియర్ అనేది కేవలం మొబైల్ ఫోన్‌కి మాత్రమే కాకుండా అప్లికేషన్లకు కూడా వర్తిస్తుంది. దీన్ని కూడా క్లియర్ చేసుకోవడం వల్ల అప్లికేషన్ వేగం పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment