గూగుల్‌ మ్యాజిక్‌ ఎడిటర్‌.. గురించి ఎప్పుడైనా విన్నారా! | Google Rolling Out Magic Editor To Pixel 7 And Pixel 6 | Sakshi
Sakshi News home page

గూగుల్‌ మ్యాజిక్‌ ఎడిటర్‌.. గురించి ఎప్పుడైనా విన్నారా!

Published Fri, May 31 2024 4:08 PM | Last Updated on Fri, May 31 2024 4:47 PM

Google Rolling Out Magic Editor To Pixel 7 And Pixel 6

పాత పిక్సెల్‌ ఫోన్‌లకు ‘మ్యాజిక్‌ ఎడిటర్‌’ను తీసుకురానున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. ‘మ్యాజిక్‌ ఎడిటర్‌’లో రకరకాల ఇమేజ్‌ ఎడిటింగ్, ఎన్‌హాన్స్‌మెంట్‌ టూల్స్‌ ఉంటాయి. ఫొటో రిసైజ్‌ చేయడానికి, ఎరేజ్‌ చేయడానికి, యూనిక్‌ ఫిల్టర్‌లను అప్లై చేయడానికి మ్యాజిక్‌ ఎడిటర్‌ ఉపయోగపడుతుంది.

కొత్త ఫ్రీ మ్యాజిక్‌ ఎడిటర్‌ ఫీచర్‌లు ప్రస్తుతం కొన్ని  పిక్సెల్స్‌ 7, పిక్సెల్స్‌ 6 సిరీస్‌ ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ‘మ్యాజిక్‌ ఎడిటర్‌’తోపాటు ఫొటోఅన్‌బ్లర్, మ్యాజిక్‌ ఎరేజర్, పోట్రాయిట్‌ లైట్‌లాంటి ఏఐ–పవర్డ్‌ ఫొటో–ఎడిటింగ్‌ ఫీచర్‌లు అన్ని ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు అందుబాటులోకి రానున్నాయి.

యాపిల్‌ ఐపాడ్‌ ప్రో 11
బాడీ: 249.7“177.5“5.3 ఎంఎం; బరువు: 466 గ్రా.; డిస్‌ప్లే: 11.00       
వోఎస్‌/సాఫ్ట్‌వేర్‌: ఐపాడ్‌వోఎస్‌ 17.5; రిజల్యూషన్‌: 1668“2420; 
బ్యాటరీ: 7,606 ఎంఏహెచ్‌; మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్‌/ 512జీబి 8జీబి ర్యామ్‌/ 1టీబి 16జీబి ర్యామ్‌/ 2టీబి 16జీబి ర్యామ్‌

పోకో ఎఫ్‌ 6..
సైజ్‌: 6.67 అంగుళాలు    
రిజల్యూషన్‌: 1220“2712 పిక్సెల్స్‌
బరువు: 179 గ్రా; బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌
ఇంటర్నల్‌: 256జీబి 8జీబి ర్యామ్‌/ 512జీబి 12జీబి ర్యామ్‌  
కలర్స్‌: బ్లాక్, గ్రీన్, టైటానియం

ఇవి చదవండి: సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్‌ ఆడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement