వారం రోజుల వ్యవధిలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కమిషన్ ఆఫ్ కాంపిటీషన్ (సీసీఐ) రూ. 936.44 కోట్ల ఫైన్ విధించింది.
ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విభాగంలో గూగుల్ తన గుత్తాదిపత్యాన్ని గూగుల్‌కు సీసీఐ రూ.1,338 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాలు మానుకోవాలని హితువు పలికింది. ఆ జరిమానాపై గూగుల్ స్పందించింది. సీసీఐ తమపై విధించిన జరిమానా భారతీయ వినియోగదారులు, వ్యాపారానికి ఎదురు దెబ్బ అని గూగుల్ పేర్కొంది.
సీసీఐ తీర్పును సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తమ ఆండ్రాయిడ్ అనేక అవకాశాలు సృష్టించిందని గూగుల్ తెలిపింది. దాంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది వ్యాపారాలు విజయానికి మద్దతుగా నిలిచిందని పేర్కొంది. సీసీఐ నిర్ణయం భారత్‌లో మొబైల్ డివైజ్‌ల ధరలు పెరిగేందుకు దారి తీస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు.
Case Nos. 07 of 2020, 14 of 2021 and 35 of 2021
— CCI (@CCI_India) October 25, 2022
CCI imposes a monetary penalty of ₹ 936.44 Crore on Google for anti-competitive practices in relation to its Play Store policies.
Read the full order here: https://t.co/GDR820ffYg
Press release: https://t.co/7HEPJeHVK3#Antitrust pic.twitter.com/TbTa6vbCXl
ఈ తరుణంలో మరోమారు సీసీఐ..గూగుల్‌కు భారీ ఎత్తున ఫైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది. మార్కెట్‌లో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్లేస్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస‍్తుందని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో గూగుల్‌కు పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని ఫైన్ విధిస్తున్నట్లు తెలిపింది.
చదవండి👉 ‘టిమ్‌కుక్’ను ట్రోల్ చేయాలనుకుంది, పాపం..అడ్డంగా దొరికిపోయిన గూగుల్?
Comments
Please login to add a commentAdd a comment