టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Thu, Jun 2 2016 7:31 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. బలసోర్ జిల్లాలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు.

తెలంగాణ: నేడు తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. దీని కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి అవార్డులను ఆయన ప్రదానం చేస్తారు.
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రిజిస్ట్రార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో రెండో రోజు రైతు భరోసా యాత్ర చేయనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు.
ఆంధ్రప్రదేశ్: నేడు విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు నవ నిర్మాణ దీక్ష చేస్తారు. బెంజిసర్కిల్‌లో నిర్వహించే దీక్షలో ఆయన ప్రతిజ్ఞ చేయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎడ్‌ సెట్-2016 ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement