వైఎస్సార్ సీపీ సమరభేరి: పెరిగిన నిత్యావరసరాల ధరలపై వైఎస్సార్ సీపీ సమరభేరి మోగించింది. ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నేడు ఏపీలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుల ఆందోళనలు నిర్వహించనుంది.
విద్యార్థులపై దాడికి నిరసన: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన విద్యార్థి జేఏసీ నాయకులపై విజయవాడలో బీజేపీ నేతల దాడిని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నేడు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మిషన్ కాకతీయ ఫేస్- 2: చెరువుల పుణరుద్ధరణ కోసం తెలంగాణ సర్కార్ ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం ఫేస్-2పై ఇంజనీర్లతో నేడు వర్క్ షాప్ జరగనుంది. జేఎన్టీయూలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులు పాల్గొననున్నారు.
ఏపీ కేబినెట్ భేటీ: రాజధాని భూముల అంశం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలే ప్రధాన ఎజెండాగా నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు.
వీరీవీరీ గుమ్మడిపండు..: కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెలంగాణ బీజేపీ నేడు తెరదించనుంది. వరంగల్ ఉప ఎన్నికలో బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది నేడు ప్రకటించనుంది. దేవయ్య, చింతా స్వామి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
నామినేషన్లు: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య, వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
నేటి వార్తావిశేషాలు
Published Mon, Nov 2 2015 7:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM
Advertisement
Advertisement