వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల నేటి నుంచి వరంగల్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 5 రోజులపాటు సాగనుంది. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువుచాలించిన 31 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు.
కేసీఆర్ చైనా పర్యటన: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశస్త్రఖర్ రావు నేడు చైనాకు వెళ్లనున్నారు. సోమవారం నుంచి 10 రోజులపాటు సాగే పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సహా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సీఎం వెంట 15 మంది రాజకీయ, అధికారుల బృందం కూడా చైనా వెళ్లనున్నది. ఈ నెల 16న కేసీఆర్ తిరిగి హైదరాబాద్ వస్తారు.
ర్యాగింగ్ నిరోధానికి ఉన్నత స్థాయి చర్చలు: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి చేపట్టవలసిన చర్చలను గురించి చర్చించేందుకు అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం హైదరాబాద్ లో భేటీ జరపనుంది.
సర్టిఫికెట్ల పరిశీలన: ఉపాధ్యాయ శిక్షణా కోర్సు బీఈడీ ప్రవేశాలలో 2015-16 విద్యా సంవత్సరానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
వర్ష సూచన: ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి ఆనుకుని మరో అల్పపీడణం ఏర్పడింది. దీంతో రాగల 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం
టుడే న్యూస్ అప్డేట్స్
Published Mon, Sep 7 2015 6:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement
Advertisement