న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుంది
న్యూఢిల్లీ: సాగరమాల పథకంపై కేంద్రప్రభుత్వం నేడు సమీక్ష నిర్వహిస్తుంది.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్రకేబినేట్ సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, పలు కీలక అంశాలపై చర్చిస్తారు.
తెలంగాణ: నేడు ఖమ్మంలో టీఆర్‌ఎస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. దీంతో ఖమ్మం పట్టణమంతా గులాబీమయం అయ్యింది. ఆ పార్టీ ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటలకు ప్లీనరీ, సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్లీనరీలో 15 అంశాలపై తీర్మానాలు చేస్తారు
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరవుపై మండల కేంద్రాల్లో నేటి నుంచి టీ.కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది.
ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇసుజీ మోటర్స్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా బుధవారం రాత్రి 8 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగును.