హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గసమావేశం సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంపై వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్: నేటి నుంచి FATPCCI శతాబ్ధి వేడుకలు హైదరాబాద్లో జరుగును. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు.
హైదరాబాద్: విత్తన ఎగుమతులపై నేడు జాతీయ సదస్సు జరుగును. ఈ సదస్సును తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తారు.
తెలంగాణ: తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ సమ్మె బాట పట్టాయి. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయనున్నాయి.
తెలంగాణ: సీఎస్ రాజీవ్ శర్మ అధికారులు, మంత్రులతో సోమవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హరితహారం కార్యక్రమంపై చర్చిస్తారు.
తెలంగాణ: పాలిసెట్ వెబ్ ఆప్షన్ల ఎంపిక సోమవారంతో ముగియనుంది
ఆంధ్రప్రదేశ్: విశాఖలో రెండు రోజుల పాటు బ్రిక్స్ ఇంధన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారు. ఎల్ఈడీ బల్బులు వినియోగం, ఇంధన ఆదాపై చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ధర్మపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలయాల కూల్చివేతపై విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో 40 మంది పీఠాధిపతులు పాల్గొంటారు.