టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Tue, Jun 28 2016 6:59 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ: తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు నేటి నుంచి సహాయ నిరాకరణ చేయనున్నారు. కోర్టు విధులకు హాజరై మౌనంగా కూర్చోవాలని ఉద్యోగులు నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చైనాలో మూడు రోజు పర్యటిస్తున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో బాబు బృందం భేటీకానుంది.
ఆంధ్రప్రదేశ్: నేటి నుంచి ప్రయోగాత్మకంగా స్మార్ట్ పల్స్ చేపట్టనున్నారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలుకు ఈ సర్వే ప్రామాణికం కానుంది.
ఆంధ్రప్రదేశ్: కృష్ణాజిల్లా నాగాయలంకకు ఓఎన్‌జీసీ అధికారులు మంగళవారం రానున్నారు. నంగేగడ్డ చెరువుల్లో వెలువడుతున్న వేడికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తారు.

స్పోర్ట్స్: నేటి నుంచి మహిళా కబడ్డీ లీగ్ ప్రారంభం
స్పోర్ట్స్: నేటి ప్రొ కబడ్డీ లీగ్‌ మ్యాచ్‌లు
ఫుణెరి పల్టాన్ vs దబాంగ్ ఢిల్లీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement