ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరుగనుంది. త్వరలో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి పలువురికి అవకాశం దక్కనుందని సమాచారం. 19 కొత్త ముఖాలకు చోటుకల్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్: కృష్ణా జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల అధికారులు మంగళవారం సమావేశం కానున్నారు.
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం నేడు జరుగును.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్: కృష్ణాజిల్లా జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం నేడు విజయవాడలో జరుగనుంది. నగరంలో ఆలయాల తొలగింపు, కృష్ణా పుష్కరాల ఏర్పాట్లతో పాటు పలు కీలక అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశముంది.
స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ నేటి మ్యాచ్లు
తెలుగు టైటాన్స్ vs బెంగళూర్ బుల్స్
మహిళల మ్యాచ్ : ఫైర్ బర్డ్స్ vs స్టార్మ్ క్వీక్స్.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Tue, Jul 5 2016 8:05 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement