టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Sat, Jul 2 2016 7:22 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఢిల్లీ: నేడు రెండో రోజు అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతోంది. భారీ భద్రత ఏర్పాట్ల మధ్య బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్‌కు యాత్రికులు బయలుదేరారు. 48 రోజుల పాటు యాత్ర కొనసాగునుంది.
హైదరాబాద్: 'సాక్షి' నేతృత్వంలో హరితహారం కార్యక్రమం జగద్గిరిగుట్టలో శనివారం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఓఎస్‌డీ పాల్గొంటారు.  

తెలంగాణ: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం శనివారం భేటీకానుంది. పెండింగ్ బిల్లులు, ఆరోగ్య సమస్యలపై చర్చించనున్నారు.
తెలంగాణ: ప్రత్యేక జిల్లా కోరుతూ జనగాం బంద్‌కు నేడు జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సూళ్లూరుపేటకు వెళ్లనున్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు దబ్బల రాజారెడ్డి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరవుతారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు.

స్పోర్ట్స్: నేటి ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు
దబాంగ్ ఢిల్లీ vs బెంగళూర్ బుల్స్
జైపూర్ పింక్ ఫాంథర్స్ vs  పుణె.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement