టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Thu, Jun 30 2016 6:55 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఢిల్లీ: కేంద్ర మంత్రిమండలి సమావేశం గురువారం సాయంత్రం జరగనుంది. తమ రెండేళ్ల పనితీరుపై మంత్రులు ప్రధానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు రచించిన 'నరసింహుడు, హాఫ్ లయన్' పుస్తక ఆవిష్కరణ జరుగును.
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరులను ఎన్‌ఐఏ గురువారం కోర్టులో హాజరుపరచనుంది. అనంతరం పీటీ వారెంట్‌పై ఢిల్లీ తరలించే అవకాశముంది.
 

తెలంగాణ: రాష్ట్రంలో జులై 5 నుంచి ఎంసెట్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 14న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగును. 24 నుంచి తుది విడత కౌన్సిలింగ్, 29 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.  
ఆంధ్రప్రదేశ్: ఏపీ న్యాయమూర్తులపై తెలంగాణ లాయర్ల దాడులకు నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు.

స్పోర్ట్స్: నేటి క్వార్టర్స్ ఫుట్‌బాల్ మ్యాచ్
పోర్చుగల్ vs పోలాండ్.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement