టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Sun, May 8 2016 8:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ కోసం ఇవాళ్టి నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళనలు చేపట్టనుంది. ఈ ఆందోళనలో భాగంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దీక్ష చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నేటి నుంచి వారం రోజులపాటు జరగనుంది. కుటుంబసభ్యులతో ఆయన థాయ్లాండ్, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు సోమవారం సాయంత్రం వెలువడనున్నాయి.

తెలంగాణ: తెలంగాణ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష ఈ నెల 15వ తేదీన జరగనుంది. సోమవారం నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు విశాఖ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు కోల్కతా వేదికగా కోల్కతా, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగును.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement