టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Tue, Jun 14 2016 7:26 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

కోల్‌కతా: నేడు కోల్‌కతాలో ఆర్థిక శాఖ మంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జీఎస్‌టీ బిల్లుపై చర్చిస్తారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సమవేశానికి హాజరవుతారు.
ఢిల్లీ: తెలంగాణ మంత్రి జోగు రామన్న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ నిర్వహించే సమావేశానికి ఆయన హాజరవుతారు.
ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు భేటీకానున్నారు. నెల్లూరు టోల్‌గేట్ వివాదంపై ఆయనతో శిద్దా చర్చిస్తారు.

ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరుగును. ఈ సమావేశంలో బాబు నిరంకుశ పాలన, రెండేళ్ల వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ఆరో రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కారించేంత వరకు దీక్ష విరమించేది లేదని ఆయన చెప్పారు. వైద్యానికి ముద్రగడ నిరాకరించడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.  
ఆంధ్రప్రదేశ్: ఏపీ కేబినేట్ సబ్‌కమిటీ మంగళవారం భేటీకానునుంది. అమరావతిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రులు చర్చిస్తారు.

తిరుమల: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పాలక మండలి నిర్ణయాలు తీసుకోనుంది.
స్పోర్ట్స్: నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు
రాత్రి 9.30         : ఆస్ట్రియా vs హంగేరి
రాత్రి 12.30       : పోర్చుగల్ vs ఐస్‌లాండ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement