టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Fri, Apr 29 2016 6:59 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఆంధ్రప్రదేశ్: నేడు ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటలకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటలకు మెడికల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్‌కు సెట్ కోడ్ జీ-2 ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతినివ్వరు.
ఆంధ్రప్రదేశ్: గుంటూరులో శుక్రవారం నుంచి అంతర్జాతీయ నృత్యోత్సవాలు జరగనున్నాయి. నృత్యోత్సవాలతో గుంటూరు నగరం కొత్తశోభను సంతరించుకోనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

తెలంగాణ: రాష్ట్రంలో కరువుపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కరువు సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు.
తెలంగాణ: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు ప్రధాన పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి సుచరితారెడ్డి నామినేషన్ వేయనున్నారు.
తెలంగాణ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీష్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. నార్లాపూర్, ఏదుల సహా ఆరు ప్యాకేజీ పనులను మంత్రి ప్రారంభిస్తారు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు పుణే వేదికగా రైజింగ్ పుణే, గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగును.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement