
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలీంగ్ సాయంత‍్రం 6 గంటలకు ముగిసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ తొలి పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కరోనా రేపిన వైరస్ ప్రకంపనలు రోజుకు రోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి చైనాలో 764 మంది చనిపోయారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్‌చేయండి.