ఢిల్లీ: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు ఖతార్‌లో పర్యటిస్తారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలకాంశాలపై ఆ దేశాధినేతలతో మోదీ చర్చిస్తారు.
ఢిల్లీ: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ కీ విడుదలతో పాటు జిప్‌మర్ ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది.
హైదరాబాద్: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ నేడు హైదరాబాద్‌లో పర్యటిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఐదో రోజు రైతు భరోసా యాత్ర చేయనున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీలో టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ నేడు అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగనుంది. ఈ ధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటారు.
స్పోర్ట్స్: నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగును. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో జొకోవిచ్, ముర్రే తలపడతారు.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Sun, Jun 5 2016 7:48 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement