టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today newsupdates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Tue, May 24 2016 6:49 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today newsupdates

న్యూఢిల్లీ: నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రణబ్ చర్చిస్తారు.
అసోం: అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేంద్రమంత్రులు, సీఎంలు, పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌రావత్ మంగళవారం సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ ఆయన్ను ప్రశ్నించనుంది.

హైదరాబాద్: నేటి నుంచి ఏపీ, తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.
తెలంగాణ: పాలమూరు ప్రాజెక్టు భూసేకరణపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం సమీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ: లా సెట్-2016 పరీక్ష నేడు జరగనుంది. ఉదయం జరిగే ఎల్‌ఎల్‌బీ పరీక్షకు 17,427 మంది, మధ్యాహ్నం జరిగే ఎల్‌ఎల్‌ఎం పరీక్షకు 1,793 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నేడు జరగనుంది. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ లయన్స్ జట్లు తలపడనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement