టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Mon, May 9 2016 7:42 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.

ఆంధ్రపద్రేశ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడురోజుల క్రితం కురిసిన వడగళ్ల వానకు పులివెందుల, లింగాల మండలాల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు సోమవారం సాయంత్రం వెలువడనున్నాయి. విశాఖలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామనేని శ్రీనివాస్ లు విడుదల చేస్తారు. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అరగంట తర్వాత విద్యార్థుల సెల్‌ఫోన్‌కు వారి ర్యాంక్ మేసేజ్ వస్తుంది.
ఆంధ్రప్రదేశ్: సింహాద్రి అప్పన్న చందనోత్సవం సోమవారం ఉదయం జరగనుంది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు తొలి దర్శనం చేసుకోనున్నారు. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం మహాదీక్షకు దిగనున్నారు. ఆర్డీఎస్ సమస్యల పరిష్కారం కోసం సింగనూరు వద్ద దీక్ష చేస్తున్నారు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు మొహాలీ వేదికగా పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగును.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement