టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Tue, May 31 2016 7:26 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మొరాకోలో పర్యటిస్తున్నారు. టెర్రరిజం, భద్రతా మండలి విస్తరణపై ఆ దేశాధికారులతో ఆయన చర్చలు జరుపుతారు.
ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తారు.

హైదరాబాద్: నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ: తెలంగాణలో ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన ఐ సెట్-2016 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మంగళవారం విడుదల చేస్తారు.
తెలంగాణ: టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులు డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్: నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ నామినేషన్ వేస్తారు.
ఆంధ్రప్రదేశ్: తమిళనాడు గవర్నర్ రోశయ్య నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement