న్యూఢిల్లీ: ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు వైఎస్ జగన్ బృందం ఢిల్లీలో పర్యటిస్తారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును, నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్న తీరును రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులతో పాటు వివిధ జాతీయ పార్టీల నేతలను కలుసుకుని వివరించనున్నారు.
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉత్తరాఖండ్‌తో పాటు పలు కీలక అంశాలపై పార్లమెంట్‌లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశముంది.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా బరిలో 345 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
తెలంగాణ: ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు.
హైదరాబాద్: నేటి నుంచి మన తెలంగాణ-మన వ్యవసాయం రైతు చైతన్య యాత్రలను వ్యవసాయాధికారులు ప్రారంభిస్తారు. ఈ యాత్రల్లో ఖరీఫ్‌పై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ తాత్కాలిక సచివాలయ భవనానికి వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తెల్లవారు జామున ప్రారంభోత్సవం చేశారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగును.