చైనా ఉపాధ్యక్షుడి పర్యటన: ఐదురోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 3న భారత్ కు విచ్చేసిన చైనా ఉపాధ్యక్షుడు లీ యువాన్ చావ్.. శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీలతో లీ యువాన్ భేటీలు జరపనున్నారు. గడిచిన నాలుగురోజుల్లో ఆయన మహారాష్ట్ర, కోల్ కతాల్లో జరిగిన పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఒక చైనా ఉపాధ్యక్షుడు భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం
ఢిల్లీ ఆర్థిక సదస్సు: 'రియలైజింగ్ ఇండియా' థీమ్ తో నేటినుంచి ప్రారంభం కానున్న ఢిల్లీ ఆర్థిక సదస్సు- 2015ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
సీఎం, మంత్రుల ఢిల్లీ పర్యటన: నాలుగు రోజుల కిందటే ఢిల్లీ వెళ్లొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నేడు మరోసారి హస్తినబాట పట్టనున్నారు. శుక్రవారం చంద్రబాబు ఢీల్లీకి పయనం కానున్నారు. మరోవైపు హోం, వైద్యారోగ్య శాఖల మంత్రులు కూడా దేశరాజధానికి పయనమయ్యారు. మంత్రి కామినేని.. మంగళగిరి ఎయిమ్స్ కు సంబంధించిన విషయాలపై కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడనున్నరు. హోం మంత్రి చినరాజప్ప పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
కరువు ప్రాంతాలకు వైఎస్సార్ సీపీ నేతలు: ఏపీలో దుర్భర కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నేడు వైఎస్సార్ సీపీ నేతలు పర్యటించనున్నారు.
సీపీఎం నిరసనలు: బక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నేడు సీపీఎం నిరసనలు చేపట్టనుంది.
తొలి టెస్ట్ రెండో రోజు: ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలిరోజు బ్యాటింగ్ కుదిన భారత్ 201 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 28 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండుకున్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
నేటి వార్తావిశేషాలు
Published Fri, Nov 6 2015 7:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM
Advertisement
Advertisement