టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Sat, May 7 2016 7:18 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

ఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష నీట్‌పై వివిధ రాష్ట్రాల అధికారులు, ఎంసీఐతో శనివారం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.  
తమిళనాడు: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.


హైదరాబాద్: ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటుచేసిన సీఆర్ కమలనాథన్ కమిటీ మరోసారి శనివారం భేటీ కానుంది. దీనికి కమిటీ చీఫ్ కమలనాథన్, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, అధికారులు హాజరుకానున్నారు.
తెలంగాణ: నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్,ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు.

ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం కర్నూలు,వైఎస్సార్ జిల్లాల్లో పర్యటిస్తారు.
ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యవర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు తలశిల రఘురాం, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు వేదికగా బెంగళూరు, పుణె జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు మొహాలీ వేదికగా పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగును.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement