ఢిల్లీ: నాలుగు రోజుల చైనా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ గురువారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అవుతారు.
కేరళ: కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి సీతారాం ఏచూరి, ప్రకాష్ కరత్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు.
తెలంగాణ: మెడికల్ ఎంసెట్-2 నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. జులై 9న ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ: బీసీ గురుకులాల వేసవి శిక్షణా తరగతులు నేటితో ముగియనున్నాయి.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. రెండెంకల వృద్ధిరేటుపై కలెక్టర్లకు బాబు దిశానిర్దేశం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్: నేడు విజయవాడలో ఎన్జీ రంగా వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ భేటీ జరుగును. ప్రైవేట్ రంగంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్: తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు ట్రేడ్ బంద్ కొనసాగనుంది. సీటీవో తీరుకు నిరసనగా హోటళ్లు, దుకాణాల యజమానులు బంద్ పాటిస్తున్నారు.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగును. ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు హైదరాబాద్, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Wed, May 25 2016 7:04 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement