ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడతారు. ఆర్ధిక, రైల్వే బడ్జెట్‌లతో పాటు పలు కీలక అంశాలపై విపక్షాలకు మోదీ సమాధానం చెప్పనున్నారు.
ఢిల్లీ: నేటి నుంచి మూడు రోజుల పాటు ఆభరణాల వర్తకులు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. బడ్జెట్‌లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం పెంపును వ్యతిరేకిస్తూ వర్తకులు సమ్మె చేయనున్నారు.
హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. తెలంగాణలో సెట్ 'సీ', ఆంధ్రప్రదేశ్ లో సెట్-3 ప్రశ్నాపత్రాలను ఎంపిక చేశారు. ఇంటర్ పరీక్షల్లో ప్రప్రథమంగా ఈ ఏడాది నుంచే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన క్యాబినేట్ భేటీకానుంది. రాష్ట్ర బడ్జెట్, శాసనసభ సమావేశాలపై చర్చించనున్నారు.
విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపుదలపై రాష్ట్రప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. అభిప్రాయ సేకరణ అనంతరం విద్యుత్ వడ్డనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
శ్రీకాళహస్తి: నేటి నుంచి శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్త కన్నప్ప ధ్వజరోహనంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.
స్పోర్ట్స్: ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7గంటలకు జరుగుతుంది.
టుడే అప్ డేట్స్
Published Wed, Mar 2 2016 6:43 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM
Advertisement