ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో గురువారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సమావేశంకానున్నారు. పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడంపై కసరత్తు చేస్తారు. రాహుల్ను కలిసే వారిలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేవీపీ, జేడీ శీలం, సుబ్బరామిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆభరణాల వర్తకుల సమ్మె రెండో రోజుకు చేరింది. బడ్జెట్‌లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం పెంపును వ్యతిరేకిస్తూ వర్తకులు మూడు రోజులు సమ్మెకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: హైదరాబాద్లో ఒడిశా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల బృందం పర్యటించనుంది. ఈ బృందం జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, డిప్యూటి మేయర్లతో భేటీ కానున్నారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయనున్నారు.
హైదరాబాద్: నేటి నుంచి మూడు రోజుల పాటు కిసాన్ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ సభల్లో రైతు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో పర్యటిస్తారు. బీజేపీ, టీడీపీలు ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నాయి.
రాజమండ్రి: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు నేతలు సమావేశంకానున్నారు.
స్పోర్ట్స్: ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ యూఏఈతో భారత్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7గంటలకు జరుగుతుంది.