న్యూఢిల్లీ: నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా కలవనున్నారు. నీట్‌పై ఆర్డినెన్స్‌కు సంబంధించి వివరణ ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే ప్రణబ్ న్యాయ సలహా కోరారు.
చెన్నై: నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితతో పాటు 29 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ రోశయ్య వారి చేత ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటికే మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియం ముస్తాబైంది.
తెలంగాణ: సీఎం కేసీఆర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం జరగనుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా జిల్లాల్లో నిర్వహించనున్న సంబరాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.
శ్రీహరికోట: సోమవారం ఉదయం ఆర్ఎల్‌వీ-టీడీ ప్రయోగ పరీక్ష ప్రారంభం కానుంది. పునర్వినియోగ రాకెట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 70 కిలో మీటర్ల ఎత్తుకెళ్లి మళ్లీ భూమికి చేరుకోనుంది.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Mon, May 23 2016 6:50 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement