టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Sun, May 1 2016 7:29 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today news updates

న్యూఢిల్లీ: నేడు ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల దినోత్సవం(మేడే) జరుపుకుంటున్నారు. దేశ ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు లు కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటిస్తున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్-2016 తొలి విడత (నీట్-1) పరీక్ష ఆదివారం జరగనుంది.

హైదరాబాద్: రవీంద్రభారతిలో జరిగే మేడే ఉత్సవాలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లతారు.
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌కోట్‌ వేదికగా గుజరాత్ లయన్స్, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు పుణే వేదికగా పుణే జెయింట్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్ జరుగును.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement