ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అఫ్గానిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లో ఆయన పర్యటిస్తారు. ఆ దేశాలతో వ్యాపారం, ఇంధన, భద్రత రంగాల్లో సహకారం పెంపుదలపై చర్చిస్తారు.
హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రజా నాట్యమండలి తొలి మహాసభలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ: భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బృందం శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ఉమాభారతితో హరీష్ బృందం చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో నాలుగో రోజు రైతు భరోసా యాత్ర చేయనున్నారు. కదిరి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు భేటీకానున్నారు.
ఆంధ్రప్రదేశ్: నేడు సీఎస్ ఠక్కర్‌తో ఉద్యోగ సంఘాలు సమావేశమవుతారు. రాజధానికి ఉద్యోగుల తరలింపుపై ప్రధానంగా చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ పీజీ ఈ సెట్-2016 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.
స్పోర్ట్స్: నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగును. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో ముగురుజ, సెరెనా విలియమ్స్ తలపడతారు.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Sat, Jun 4 2016 7:31 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement