ఆంధ్రప్రదేశ్ ప్రతిక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సేవ్ డెమొక్రసీ ఉద్యమం ఢిల్లీకు చేరుకుంది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సేవ్ డెమొక్రసీ ఉద్యమం ఢిల్లీకు చేరుకుంది. మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి,శరద్ యాదవ్‌లతో వైఎస్ జగన్ బృందం సమావేశం కానున్నారు. టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను ఢిల్లీ నేతలకు వివరించనున్నారు.
న్యూఢిల్లీ: భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం మంగళవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చిస్తారు.
తెలంగాణ: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. బ్యాలెట్ ద్వారా పాలేరు ఉప ఎన్నిక నిర్వహించాలని, ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్లీనరీకి అనుమతి ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను ఉత్తమ్ కోరనున్నారు.
ఆంధ్రప్రదేశ్: శ్రీహరికోటలో మంగళవారం పీఎస్‌ఎల్‌వీ సీ33 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభంకానుంది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్: తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.
హైదరాబాద్: నేడు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పుణే జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగును.