టుడే న్యూస్ అప్‌డేట్స్ | today newsupdates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Sun, Apr 24 2016 7:11 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today newsupdates

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ తన మనసులో మాటను వెల్లడిస్తారు.
న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం జరపనున్నారు. పంచాయతీ రాజ్ శాఖాధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఆదివారం జరగనుంది. రేపటి నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

తెలంగాణ: తెలంగాణ రాష్ర్ట పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు ఆదివారం జరుగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జంట జిల్లాలో జరిగే ఈ పరీక్షలకు 94,477 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో 74 పరీక్ష కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌తో సహా 124 పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్: సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరగనుంది. హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ఈ అవార్డులను బహుకరించనున్నారు. సుప్రసిద్ధులైన న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన పలు రంగాల్లోని ప్రముఖులు, నిష్ణాతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

హైదరాబాద్: నేటి నుంచి ఆన్‌లైన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు పుణే వేదికగా రైజింగ్ పుణే, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగును.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement