ఆంధ్రప్రదేశ్: పీఎస్‌ఎల్‌వీ సీ-33 రాకెట్ కౌంట్‌డౌన్ నిర్విరామంగా కొనసాగుతోంది. శ్రీహరికోటలో గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు నింగిలోకి ప్రవేశపెడతారు. 1425 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -వన్ జీ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్షలోకి తీసుకెళ్లనుంది.
ఆంధ్రప్రదేశ్: రాజధాని ప్రాంత రైతుల నుంచి ప్లాట్ల కేటాయింపు కోసం ఆప్షన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి 29 గ్రామాల్లో ఫారాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
హైదరాబాద్: నేటి నుంచి సాక్షి ప్రధాన సంచికలో రెండు పేజీల 'భవిత' అందించనున్నారు.
తెలంగాణ: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం భేటీకానుంది. పాలేరు ఉప ఎన్నికలో అనూసరించాల్సిన వ్యూహాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తారు.
తెలంగాణ: భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బెంగళూరులో పర్యటించనున్నారు. రాజోలిబండపై కర్ణాటక ప్రభుత్వంతో హరీష్ బృందం చర్చిస్తుంది.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా గురువారం రాత్రి 8 గంటలకు ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగును.